దుర్గం చెరువు దగ్గర మొదటి 10 కే రన్, ఉత్సాహంగా పాల్గొన్న యువతీ యువకులు, పరుగు ప్రయోజనాలపై అవగాహన
హైదరాబాద్ దుర్గం చెరువు దగ్గర 10 కే రన్ ఉదయం ప్రారంభమైంది. మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ రన్ ను..
హైదరాబాద్ దుర్గం చెరువు దగ్గర 10 కే రన్ ఉదయం ప్రారంభమైంది. ఆదివారం వేళ తెల్లాతెల్లారకముందే మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ రన్ ను జెండా ఊపి రన్ ప్రారంభించారు. వందలాది మంది రన్నర్లు హాజరై దుర్గం చెరువు పై నిర్వహించిన మొదటి రన్ లో ఉత్సాహంగా పాల్గొన్నారు. యువతీ, యువకులతోపాటు చిన్నాపెద్దా అంతా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ రన్ ను విజయవంతం చేస్తూ పరుగు ఆరోగ్యానికి ఎంత ఉపయోగమో తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.