మరోసారి రక్తమోడిన ఔటర్ రింగ్ రోడ్, హిమాయత్ సాగర్ ఎగ్జిట్ దగ్గర ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి

నిత్యం ఎక్కడోక్కడ రోడ్లు రక్తమోడుతూనే ఉన్నాయి. ఆదివారం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పై జరిగిన ప్రమాదం ఇద్దరి ప్రాణాలు తీసింది. రంగారెడ్డి జిల్లా..

  • Venkata Narayana
  • Publish Date - 9:48 am, Sun, 24 January 21
మరోసారి రక్తమోడిన ఔటర్ రింగ్ రోడ్,  హిమాయత్ సాగర్ ఎగ్జిట్ దగ్గర ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి

నిత్యం ఎక్కడోక్కడ రోడ్లు రక్తమోడుతూనే ఉన్నాయి. ఆదివారం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పై జరిగిన ప్రమాదం ఇద్దరి ప్రాణాలు తీసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ORR పై ఈ ప్రమాదం జరిగింది. హిమాయత్ సాగర్ ఎగ్జిట్ వద్ద జరిగిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. టాటా ఏస్‌ వాహనం డివైడర్‌ని ఢీకొని బోల్తా పడ్డంతో ఈ ప్రమాదం సంభవించింది. పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టంకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.