యూకేలో జులై 17 వరకు లాక్ డౌన్ పొడిగింపు, విజిటర్లకు 10 రోజుల క్వారంటైన్, ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటన

యూకేలో, ముఖ్యంగా ఇంగ్లండ్ లో లాక్ డౌన్ ను జులై 17 వరకు పొడిగిస్తున్నట్టు ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. మ్యుటెంట్ వేరియంట్ కేసులు..

  • Umakanth Rao
  • Publish Date - 9:46 am, Sun, 24 January 21
యూకేలో జులై 17 వరకు లాక్ డౌన్ పొడిగింపు, విజిటర్లకు 10 రోజుల క్వారంటైన్, ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటన

యూకేలో, ముఖ్యంగా ఇంగ్లండ్ లో లాక్ డౌన్ ను జులై 17 వరకు పొడిగిస్తున్నట్టు ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. మ్యుటెంట్ వేరియంట్ కేసులు ఎక్కువగా ఉన్న కారణంగా లాక్ డౌన్ నిబంధనలను సడలించే విషయాన్ని పరిశీలించడంలేదని ఆయన చెప్పారు. ఈ వేరియంట్ సాధారణ కరోనా వైరస్ కన్నా తీవ్రమైందని భావిస్తున్నట్టు తెలిపారు. ఇంగ్లండ్ లోని ఆసుపత్రుల్లో 38 వేలమందికి పైగా రోగులు చికిత్స పొందుతున్నారని, గత 24 గంటల్లో 4,600 మంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారన్నారు. దేశంలో 40,261 మందికి వేరియంట్ పాజిటివ్ అని తేలిందని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. దీంతో ఈ కేసుల సంఖ్య 35,83,901 కి చేరింది. ఒక్క రోజులో కరోనా వైరస్ బారిన పడి సుమారు 1401 మంది మృతి చెందారు. కాగా-  ప్రస్తుత వ్యాక్సిన్లు ఈ వైరస్ ను అదుపు చేయగలవని  భావిస్తున్నట్టు జాన్సన్ తెలిపారు. ఈ వేరియంట్ భయంతో..-వేలాది మంది బ్రిటన్ నుంచి పొరుగునున్న దేశాలకు వెళ్తున్నందుకు సమాయత్తమవుతున్నారు. లండన్ లోని హీత్రో విమానాశ్రయం వీరితో కిటకిటలాడుతోంది.