గోల్ఫ్ ఆడుతూ, సహచరులతో ఎంజాయ్ చేస్తూ, అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కి ఇక తీరికే తీరిక !

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి ఇక బోలెడంత తీరిక దొరికింది. వైట్ హౌస్ ను వీడి.. ఫ్లోరిడా లోని తన నివాసానికి చేరుకున్నాక ఉల్లాసంగా గడుపుతున్నారు..

గోల్ఫ్ ఆడుతూ, సహచరులతో ఎంజాయ్ చేస్తూ, అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కి ఇక తీరికే తీరిక !
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 24, 2021 | 11:22 AM

Donald Trump:అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి ఇక బోలెడంత తీరిక దొరికింది. వైట్ హౌస్ ను వీడి.. ఫ్లోరిడా లోని తన నివాసానికి చేరుకున్నాక ఉల్లాసంగా గడుపుతున్నారు. వెస్ట్ పామ్ బీచ్ లో గోల్ఫ్ ఆడుతూ.. సహచరులతో కబుర్లాడుతూ ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఆయన అభిమానుల్లో కొందరు ఇప్పటికీ ఆయనకి విష్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.  ‘మీరింకా మా అధ్యక్షులే’, ‘మీరు గెలిచారు’ అని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని ట్రంప్ ని గ్రీట్ చేస్తున్నారు. ఇక ‘మేక్ అమెరికా ఎగైన్’ అన్న అక్షరాలతో కూడిన క్యాంపెయిన్ క్యాప్, వైట్ పోలో షర్ట్ ధరించిన ట్రంప్ తన మోటార్ కేడ్ డ్రోవ్ సందర్భంగా తనను పలకరిస్తున్నవారికి చిరునవ్వులతో తానూ విష్ చేస్తున్నారు.

ఇక సెనేట్ లో ట్రంప్ అభిశంశన విచారణ ఫిబ్రవరి 8 నుంచి ప్రారంభం కానుంది. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ జుడీషియరీ కమిటీ..ఈయనకు బుధవారం సాయంత్రం 6 గంటలవరకు సమయమిచ్చింది. పానెల్ ప్రొసీడింగ్స్ లో పాల్గొనేందుకు మీ లాయర్ ను ఆ లోగా పంపాలనుకుంటున్నారా అని ఈ కమిటీ ప్రశ్నించింది. కానీ ఈ హియరింగ్ లో తాము పాల్గొనే ప్రసక్తి లేదని ట్రంప్ లాయర్లు తేల్చి చెప్పారు.

Video Courtesy: mailonline