ఆ మహిళను చూసి వైద్యులే నివ్వరపోతున్నారు.. ఒకటి కాదు రెండు కాదు 31 సార్లు కరోనా పాజిటివ్.. ఇప్పుడామె ఎలా ఉందంటే..?

ఓ మహిళకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 31 సార్లు కరోనా సోకిందట. పరీక్ష చేసుకున్నా ప్రతిసారి ఆమెకు పాజిటివ్‌ నిర్దారణ అయ్యింది.

  • Balaraju Goud
  • Publish Date - 7:32 pm, Sat, 23 January 21
ఆ మహిళను చూసి వైద్యులే నివ్వరపోతున్నారు.. ఒకటి కాదు రెండు కాదు 31 సార్లు కరోనా పాజిటివ్.. ఇప్పుడామె ఎలా ఉందంటే..?

31 times Coronavirus Positive :  చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. అటు దేశంలో మారుమూల పల్లెకు సైతం పాకింది. ఇదే క్రమంలో ఓ మహిళకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 31 సార్లు కరోనా సోకిందట. పరీక్ష చేసుకున్నా ప్రతిసారి ఆమెకు పాజిటివ్‌ నిర్దారణ అయ్యింది. ఇదీ చూసిన వైద్యులే నివ్వెరపోతున్నారు. సదరు మహిళకు ఎలాంటి లక్షణాలు లేకున్నా ఆమెకు పాజిటివ్‌ వస్తోంది. దీంతో శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు ఆమె నుంచి నమూనాలు సేకరించి అధ్యయనం చేస్తున్నారు.

రాజస్థాన్‌లోని అప్నాఘర్‌ ఆశ్రమానికి చెందిన శారదకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవు. అయినా కూడా ఆమెకు కేవలం ఐదు నెలల్లోనే 31 సార్లు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆమెను భరత్‌పూర్‌ జిల్లాలోని ఆర్‌బీఎం ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు. గతేడాది ఆగస్టు 20వ తేదీన ఆమెకు తొలిసారి కరోనా పరీక్ష చేయగా కరోనా పాజిటివ్‌ నిర్దారణ అయ్యిందని వైద్యులు తెలిపారు. తర్వాత ఆమెకు పరీక్షలు నిర్వహించిన ప్రతీసారి పాజిటివ్‌గా తేలింది. అలా ఇప్పటివరకు శారదకు 31 సార్లు కరోనా పరీక్షలు చేయగా.. ప్రతిసారి పాజిటివ్‌ వచ్చిందని వివరించారు. ప్రారంభంలో ఆమె అస్సలు నిల్చోడానికి కూడా సాధ్యమయ్యేది కాదన్న వైద్యులు. అలాంటిది ఇప్పుడు ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉంది.గతంలో ఆమె అల్లోపతి, ఆయుర్వేద, హోమియోపతి వైద్యం చేయించుకున్నారు. ఇంకా ఆశ్చర్యంగా ఆమె 7 8 కిలోల బరువు పెరగడం విశేషం..

ఇదిలావుంటే, తొలిసారి వచ్చిన వైరస్‌ చికిత్స తీసుకున్నా శరీరంలో ఉంటుందని.. అందువల్లే ఆమెకు తరచూ పాజిటివ్‌ వచ్చిందని వైద్యులు భావిస్తున్నారు. ఆమె కడుపు భాగంలో కరోనా వైరస్‌ ఆనవాళ్లు ఉండడంతో ఈ విధంగా జరుగుతుందని చెబుతున్నారు. అయితే, ఇందుకు సంబంధించి పూర్తి నిర్ధారణ రాలేదని వైద్య సిబ్బంది తెలిపారు. ఆమె నమూనాలు సేకరించి పరిశోధనకు పంపినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి… ఏపీ ఉద్యోగ సంఘాలపై ఎస్ఈసీ ఆగ్రహం.. వెంకట్రామిరెడ్డిపై నిఘా పెట్టాలంటూ డీజీపీకి లేఖ