బ్రేకింగ్: ఇండియాలో పెరిగిన యూకే కోవిడ్ వేరియంట్ బాధితుల సంఖ్య, క్వారంటైన్ కు తరలింపు, ఆరోగ్యశాఖ వెల్లడి

ఇండియాలో యూకే కోవిడ్ వేరియంట్ బాధితుల సంఖ్య 150 కి పెరిగినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వీరిని, వీరితో సన్నిహితంగా ఉన్నవారిని కూడా...

బ్రేకింగ్: ఇండియాలో పెరిగిన యూకే కోవిడ్ వేరియంట్ బాధితుల సంఖ్య, క్వారంటైన్ కు తరలింపు, ఆరోగ్యశాఖ వెల్లడి
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Jan 23, 2021 | 7:23 PM

ఇండియాలో యూకే కోవిడ్ వేరియంట్ బాధితుల సంఖ్య 150 కి పెరిగినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వీరిని, వీరితో సన్నిహితంగా ఉన్నవారిని కూడా క్వారంటైన్ కి తరలించినట్టు ఈ శాఖ తెలిపింది.వీరి సహ ప్రయాణికులు, ఫ్యామిలీ కాంటాక్టులు, ఇతరుల కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రారంభమైందని, అలాగే జీనోమ్ సీక్వెన్సింగ్, ఇతర స్పెసిమన్ల విశ్లేషణ కూడా చేపడుతున్నామని ఈ శాఖ అధికారులు తెలిపారు. కోవిడ్ వేరియంట్ బాధితులందరికీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశిత హెల్త్ కేర్ కేంద్రాల్లో సింగిల్ రూమ్ ఐసోలేషన్ కి తరలించినట్టు వారు చెప్పారు. ఇప్పటికే యూకే వేరియంట్ డెన్మార్క్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, ఇటలీ వంటి వివిధ దేశాలకు వ్యాపించింది. అయితే పాత వైరస్ కారణంగా 10 మంది మృతి చెందారనుకుంటే ఈ వేరియంట్ బారిన పడి 13 నుంచి 14 మంది మరణించినట్టు అంచనా వేస్తున్నారు.