Vitamin B12 Deficiency: మతిమరుపుతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే విటమిన్ బి 12 లోపమేమో..

Surya Kala

Surya Kala |

Updated on: Jun 16, 2021 | 2:47 PM

Vitamin B12 Deficiency:  విటమిన్‌ బీ 12 మన శరీరం పనితీరులో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వృద్ధుల్లో తికమక పడటం, మతిమరుపు వంటి లక్షణాలు సహజంగా కనిపించేవే..

Vitamin B12 Deficiency: మతిమరుపుతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే విటమిన్ బి 12 లోపమేమో..
Vitamin B12

Vitamin B12 Deficiency:  విటమిన్‌ బీ 12 మన శరీరం పనితీరులో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వృద్ధుల్లో తికమక పడటం, మతిమరుపు వంటి లక్షణాలు సహజంగా కనిపించేవే గానీ ఇందుకు బీ12 విటమిన్ లోపమూ ఒకొక్కసారి కారణం అవొచ్చు. మనం తీసుకునే ఆహారంలోని బీ12 విటమిన్‌ను గ్రహించే శక్తి కూడా తగ్గుతుంది. ఇది బీ12 లోపానికి దారితీస్తుంది. విటమిన్ బి 12, ను సయనో కొబాలమిన్, కొబాలమైన్‌ అని అంటారు. ఈ విటమిన్ లోపం వల్ల ఫెర్నీషియస్ ఎనీమియాకు దారి తీస్తుంది. ఇది నీటిలో కరిగే విటమిను. మెదడు , నాడీమండలము పనిచేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు ఎర్ర రక్త కణాలు తయారిలోను, శరీరములో కణములో డి.ఎన్‌.ఎ తయారీ , రెగ్యులేషన్‌ , కొవ్వు ఆమ్లాలు తయారీలోను ఈ విటమిన్ చాలా అవసరం.

విటమిన్‌ B12 ప్రాధాన్యత:

మన నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి, ఎర్ర రక్తకణాల తయారీకి బీ12 విటమిన్‌ తప్పనిసరి. దీని లోపం కొద్ది మోతాదులోనే ఉంటే కండరాల బలహీనత, నిస్సత్తువ, వణుకు, మూత్రం ఆపుకోలేకపోవటం, రక్తపోటు తక్కువ కావటం, కుంగుబాటు, మతిమరుపు వంటి గ్రహణ సమస్యలు తలెత్తుతాయి. ఇక లోపం మరీ తీవ్రమైతే మాత్రం రక్తహీనతకు దారితీస్తుంది. అన్ని బీ విటమన్ల మాదిరిగానే బీ12 కూడా నీటిలో కరుగుతుంది.

అయితే మోతాదు ఎక్కువగా ఉంటే దీన్ని మన శరీరం.. కాలేయం, కణజాలాల్లో నిల్వ చేసుకుంటుంది. అందువల్ల ఆహారం ద్వారా తగినంత బీ12 తీసుకోకపోయినా చాలాకాలం పాటు రక్తంలో దీని మోతాదు తగ్గినట్టు కనిపించదు. ఒకవేళ నిల్వ మోతాదు తక్కువగా ఉంటే చాలా త్వరగానే బీ12 లోపం కనబడొచ్చు. పిల్లల్లోనైతే అంతకన్నా ముందుగానే ప్రభావం చూపుతుంది. విటమిన్ లెవల్స్ ను తెలుసుకోవడానికి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. విటమిన్ బి12 లోపం ఉన్నవారు జీవశైలిలో ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి . డైట్ లో మార్పులు చేసుకొన్న తర్వాత మార్పులు లేకుంటే డాక్టర్ ను కలిసి, విటమిన్ డి12 వైద్యపరమైన కారణాలను తెలుసుకోవాలి . కొన్ని ఆహారాలను తీసుకోవడం వల్ల విటమిన్స్ ను సమతుల్యంగా ఉంచుతాయి. పాలు, చేపలు, పీతలు, లివర్ , సోయా ప్రోడక్ట్స్, చీజ్ , గుడ్డు , రెడ్ మీట్ , పాలు, పెరుగు వంటి ఆహారాన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. వీటిల్లో విటమిన్ బి 12 ఎక్కువగా ఉంటుంది.

Also Read: అమ్మమ్మ చేతి కమ్మని వంట వెజిటబుల్ మజ్జిగ పులుసు తయారీ విధానం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu