Acidity Yoga: అసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.? ఈ యోగసనాలను ట్రై చేయండి.. మంచి ఫలితం ఉంటుంది..
Acidity Reducing Yoga: అసిడిటీ... మనలో చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొనే ఉంటారు. గుండె, ఛాతిలో విపరీతమైన మంట, తిన్నది సరిగ్గా జీర్ణం కాకపోవడం, నోరు రుచించకపోవడం ఇలా ఎన్నో సమస్యలను అసిడిటీ వల్ల వస్తాయి...
Acidity Reducing Yoga: అసిడిటీ… మనలో చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొనే ఉంటారు. గుండె, ఛాతిలో విపరీతమైన మంట, తిన్నది సరిగ్గా జీర్ణం కాకపోవడం, నోరు రుచించకపోవడం ఇలా ఎన్నో సమస్యలను అసిడిటీ వల్ల వస్తాయి. ఈ సమస్యను మొదట్లోనే గుర్తించి నివారణ చర్యలు తీసుకుంటే త్వరగా తగ్గించుకోవచ్చు. అలా కాకుండా నిర్లక్ష్యం చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే అసిడిటీని యోగసనాల ద్వారా కూడా తగ్గించుకోవచ్చనే విషయం మీకు తెలుసా? అన్ని సమస్యలకు పరిష్కారం దొరికే యోగాసనాల ద్వారా అసిడిటీని కూడా తరిమికొట్టవచ్చు.. ఇంతకీ ఎలాంటి యోగసనాలు చేస్తే అసిడిటీని కంట్రోల్ చేయొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
హలాసన్..
ఈ పదం సంస్కృతం నుంచి వచ్చింది. హలా అంటే సంస్కృతంలో నాగలి అని అర్థం. నాగలి భంగిమలో ఉంటే ఈ ఆసనం శరీరంలోని ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ ఆసనాన్ని నిత్యం వేయడం ద్వారా.. బరువు తగ్గడంతో పాటు జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. సక్రమమైన జీర్ణక్రియతో అసిడిటీ కంట్రోల్‌లోకి వస్తుంది.
వజ్రాసనం..
శరీరంలో యాసిడ్ స్థాయిల ఉత్పత్తిని తగ్గించడానికి వజ్రాసనం బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఈ ఆసనం ఎక్కువగా శ్వాసతో ముడిపడి ఉన్న భంగిమ.
పావనముక్తాసం..
ఈ ఆసనం ఉదర కండరాలను బలోపేతం చేస్తాయి. అంతేకాకుండా శరీరంలో యాసిడ్ ఉత్పత్తులను అదుపులో ఉంచుతాయి. పావనముక్తాసనం వేయం ద్వారా మలబద్దకం సమస్యకు చెక్ పెట్టవచ్చు. జీర్ణవ్యవస్థను మెరుగు పరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా వెన్న నొప్పిని కూడా దూరం చేస్తుందీ ఆసనం.
RGV : ఆర్జీవీకి తెలంగాణ హైకోర్టులో బ్రేకు.! దిశ ఎన్ కౌంటర్ సినిమా విడుదలను 2 వారాలు ఆపాలని ఆదేశం
థర్డ్ కోవిద్ ముప్పు భయం…..ఢిల్లీలో సొంత ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటున్న ప్రైవేటు ఆసుపత్రులు