Throat Pain: గొంతు నొప్పితో ఇబ్బందిపడుతున్నారా ?.. అయితే ఈ పద్ధతులను పాటిస్తే క్షణాల్లో ఉపశమనం..

మండుటెండల నుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. తుఫాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. దీంతో జలుబు, దగ్గుతోపాటు.. గొంతు నొప్పి సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు చాలా మంది...

Throat Pain: గొంతు నొప్పితో ఇబ్బందిపడుతున్నారా ?.. అయితే ఈ పద్ధతులను పాటిస్తే క్షణాల్లో ఉపశమనం..
Throat
Follow us
Srinivas Chekkilla

|

Updated on: May 27, 2022 | 8:27 AM

మండుటెండల నుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. తుఫాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. దీంతో జలుబు, దగ్గుతోపాటు.. గొంతు నొప్పి సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు చాలా మంది. ముఖ్యంగా గొంతు నొప్పిని తగ్గించుకునేందుకు ఈ పద్ధతులు పాటించాలి. విపరీతమైన వేడి గాలుల నుంచి ఒక్కసారిగా చల్లని గాలులతో చాలా మంది గొంతు నొప్పి సమస్య తీవ్రంగా వేధిస్తుంది. ఈ గొంతు నొప్పి సమస్యను తగ్గించుకోవడానికి ఇంట్లో ఉండే పదార్థాలను ఉపయోగించవచ్చు. వేడి నీటిలో ఉప్పు వేసి పుక్కిలించాలి. రోజుకు రెండుసార్లు క్రమం తప్పకుండా ఇలా చేయడం వలన గొంతు నొప్పి తగ్గుతుంది. ఇది నోటిలో ఉండే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. ఒక కప్పు వేడి నీటిలో అర టీస్పూన్ ఉప్పు కలిపి పుక్కిలించడం వలన ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. హాట్ హెర్బల్ టీ.. వివిధ రకాల హెర్బల్ టీలను ఉపయోగించడం వలన గొంతు నొప్పి తగ్గించవచ్చు. లవంగం టీ, గ్రీన్ టీ ఈ సమస్యను తగ్గిస్తాయి. హెర్బల్ టీలలో యాంటీ బ్యాక్టీరియల్.. యాంటీ ఇన్ప్లమేటరీ లక్షణాలు ఉంటాయి.

తేనెలో సహజ యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది గొంతు నొప్పిని తగ్గించడంలో సహయపడుతుంది. బ్యాక్టీరియాను తొలగించడమే కాకుండా వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. అలాగే సైనస్ నొప్పిని తగ్గించడానికి హ్యూమిడిఫైయర్ సహయపడుతుంది. వేడి నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణాన్ని వేసి టవల్ కప్పి.. ఆ నీటి ఆవిరిని పీల్చుకోవాలి. నిమ్మకాయ కూడా గొంతు నొప్పిని తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. గొంతులో శ్లేష్మాన్ని తొలగించడం… నొప్పిన తగ్గించడంలో సహయపడుతుంది. ఇందులో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహయపడుతుంది. అంతేకాకుండా.. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడానికి..శక్తిని పెంచడానికి సహయపడుతుంది. వేడి నీటిలో టీస్పూన్ నిమ్మరసం కలిపి తీసుకోవడం మంచిది. హాట్ సాస్.. గొంతు నొప్పిని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. పచ్చి మిరపకాయలతో తయారు చేసిన సాస్ లో క్యాప్సైసిస్ ఉంటుంది. ఇది వాపు తగ్గించడంలో సహయపడుతుంది. ఒక గ్లాసు నీటిలో కొన్ని చుక్కల హాట్ సాస్ వేసి బాగా కలిపి తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..