Health: హైబీపీతో ఇబ్బంది పడుతున్నారా.? అయితే ఈ విషయాలను ఓసారి చెక్‌ చేసుకోండి..

Health: ప్రస్తుతం ఎక్కువ మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో రక్తపోటు ఒకటి. ఒకప్పుడు 50 నుంచి 60 ఏళ్ల దాటిన వారిలో ఎక్కువగా హైబీపీ సమస్య ఎక్కువ కనిపించేదు. కానీ ప్రస్తుతం పట్టుమని 30 ఏళ్లు కూడా నిండని...

Health: హైబీపీతో ఇబ్బంది పడుతున్నారా.? అయితే ఈ విషయాలను ఓసారి చెక్‌ చేసుకోండి..
High Bp
Follow us
Narender Vaitla

|

Updated on: May 27, 2022 | 6:55 AM

Health: ప్రస్తుతం ఎక్కువ మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో రక్తపోటు ఒకటి. ఒకప్పుడు 50 నుంచి 60 ఏళ్ల దాటిన వారిలో ఎక్కువగా హైబీపీ సమస్య ఎక్కువ కనిపించేదు. కానీ ప్రస్తుతం పట్టుమని 30 ఏళ్లు కూడా నిండని వారు కూడా హైబీపీ బారిన పడుతున్నారు. మారుతోన్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు వెరసి రక్తపోటుతో ఇబ్బంది పడుతున్నారు. హైబీపీ ఒక్కసారి వచ్చిందో ఇక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తూనే ఉంటుంది. శరీరంలో ప్రతీ అవయవంపై రక్తపోటు ప్రభావం చూపుతుంది. అయితే హైబీపీ బారిన పడ్డవారు కొన్ని విషయాలను చెక్‌ చేసుకోవాలి? తాము తెలిసి చేసే తప్పులే రక్తపోటును పెంచుతాయి. ఇంతకీ ఆ అంశాలేంటంటే..

* హైబీపీతో బాధపడేవారు రోజు తీసుకునే ఆహారాన్ని ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసుకోవాలి. ఆహారంలో ఎట్టి పరిస్థితుల్లో ఉప్పు స్థాయి పెరగకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ప్యాక్‌ చేసిన చిప్స్‌, ప్రాసెస్డ్‌ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ఉప్పును తగ్గించి పండ్లు, కూరగాయలు, తృణ‌ధాన్యాలు తీసుకోవాలి.

* రక్తపోటు ఉన్న వారు వెంటనే ఆల్కహాల్‌ను మానేయాలి. ఎప్పుడో ఒకసారి అనే ఆలోచనకు కూడా విడనాడాలి. ఆల్కహాల్‌ కాలక్రమేణా రక్తపోటును పెంచుతుంది. మద్యానికి బానిసలనైన వారు మానేసి, ఇతర వ్యాపకాలను అలవాటు చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

* ఒత్తిడి, ఆందోళన కూడా బీపీ పెరగడానికి కారణంగా చెప్పవచ్చు. కాబట్టి శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయాలి. మెడిటేషన్‌ చేస్తూ నిత్యం ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకోండి వెంటనే రక్తపోటు అదుపులోకి వస్తుంది.

* మీకు ఒత్తిడి కలుగుతోన్న విషయాలను ఒకసారి ఆలోచించుకోండి. ఏ విషయాన్ని ఎక్కువగా ఆలోచిస్తే చిరాకు, కోపం కలుగుతుంతో అలాంటి ఆలోచనలకు దూరంగా ఉండండి.

* కెఫిన్‌ డ్రింక్స్‌ వల్ల బీపీ పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. వీటి స్థానంలో ఎక్కువగా మంచి నీరు లేదా ఫ్రూట్‌ జ్యూస్‌లను అలవాటు చేసుకోండి.

* బీపీ ఉన్న వారు పొగ తాగడానికి పొరపాటున కూడా అలవాటు చేసుకోకూడదు. ఒకవేళ అప్పటికే అలవాటు ఉంటే వెంటనే మానేయాలి. అధిక రక్తపోటుకు ధూమపానం తోడైతే గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంటుదనే విషయాన్ని మర్చిపోకండి.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?