Traveling Tips: మధుమేహం ఉన్నవారు టూర్‌ వెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నారా..? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Traveling Tips:మధుమేహం ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఇక వీరు టూర్‌ వెళ్లాలనుకుంటే పలు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ఉత్తమం. నిర్లక్ష్యం వహిస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది..

Traveling Tips: మధుమేహం ఉన్నవారు టూర్‌ వెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నారా..? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Follow us

|

Updated on: May 30, 2022 | 8:40 PM

Traveling Tips:మధుమేహం ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఇక వీరు టూర్‌ వెళ్లాలనుకుంటే పలు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ఉత్తమం. నిర్లక్ష్యం వహిస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరికి ప్రయాణాలు చేయడం అనేది సరదా.. కానీ డయాబెటిస్‌తో పాటు దీర్ఘకాలిక వ్యాధులున్నవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆహార నియమాలు పాటిస్తూ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. టూర్లకు వెళ్లేటప్పుడు మధుమేహం ఉన్నవారు తమను తాము సిద్ధం చేసుకోవాలి. ప్రయాణానికి ముందు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యులను సంప్రదించుకోవడం మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలు ఏ మేరకు ఉన్నాయో తెలుసుకోవాలి. ప్రయాణాలు చేసేముందు మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. అందుకోసం కొన్ని టిప్స్‌ పాటించాల్సి ఉంటుంది.

☛ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను రోజువారీగా చెక్ చేసుకోవాలి.

☛ ప్రయాణంలో మొత్తంబాడీ హైడ్రేట్‌గా ఉండేలా త‌గినంత నీరు తాగాలి. స్వ‌చ్ఛ‌మైన‌ నీటిని వెంట తీసుకెళ్లడం ఉత్తమం

ఇవి కూడా చదవండి

☛ స్నాక్స్‌, ఆహారాన్ని ఇంటినుంచే తీసుకెళ్లాలి. బ‌య‌ట దొరికే ఆహార‌ప‌దార్థాల జోలికి వెళ్లకపోవడం మరి మంచిది.

☛ రోజూ వేసుకోవాల్సిన మందులు, ప్రిస్క్రిప్షన్‌, డయాబెటిస్ టెస్టింగ్ కిట్, ఇన్సులిన్ తీసుకెళ్లడం మర్చిపోవద్దు.

☛ వ్యాయామం చేయ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో పెట్టుకోవచ్చు. ప్ర‌యాణ స‌మ‌యంలో విరామం దొరికిన‌ప్పుడు చిన్న చిన్న‌ వ‌ర్కౌట్స్ చేస్తుండగాలి. శ‌రీరాన్ని అతిగా ఇబ్బంది పెట్టే వ్యాయమలు చేయవద్దు.

☛ మొబైల్లో రిమైండర్ సెట్ చేసుకొని, స‌మ‌యానికి మందులు వేసుకోవాలి.

☛ రెస్టారెంట్లకు వెళ్లిన‌ప్పుడు ర‌క్తంలో చ‌క్కెర‌స్థాయిల‌ను పెంచే ఆహారాలను తినకపోవడం మంచిది.

☛ మీరు వెళ్తున్న ప్ర‌దేశంలో స‌మీపాన ఉన్న ఫార్మ‌సీలు, ద‌వాఖాన‌ల జాబితా రూపొందించుకోవాలి.

☛ మెడికల్ ఐడీ బ్రాస్‌లెట్‌ను త‌ప్ప‌క‌ ధరించండి. మీ ఆరోగ్యం, అలెర్జీలు మొదలైన వాటికి సంబంధించిన ఐడీ, ఇతర సమాచారం అందులో ఉండేలా చూసుకోండి. ప్ర‌యాణానికి ముందు ఒక‌సారి వైద్యుడిని సంప్రదించ‌డం మంచిది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి