Health Tips: మెరిసే చర్మం కోసం ఈ సూపర్ ఫుడ్స్‌ తప్పనిసరిగా తినాలి.. అవేంటంటే..?

Health Tips: మెరిసే చర్మం కోసం ప్రజలు అనేక మార్గాలను ప్రయత్నిస్తారు. రసాయనాలు కలిగిన అనేక బ్యూటి ప్రొడాక్ట్స్‌ వాడుతారు. అయినా ఎలాంటి ఫలితం ఉండదు. పైగా వాటివల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయి.

Health Tips: మెరిసే చర్మం కోసం ఈ సూపర్ ఫుడ్స్‌ తప్పనిసరిగా తినాలి.. అవేంటంటే..?
Glowing Skin
Follow us

|

Updated on: May 31, 2022 | 6:25 AM

Health Tips: మెరిసే చర్మం కోసం ప్రజలు అనేక మార్గాలను ప్రయత్నిస్తారు. రసాయనాలు కలిగిన అనేక బ్యూటి ప్రొడాక్ట్స్‌ వాడుతారు. అయినా ఎలాంటి ఫలితం ఉండదు. పైగా వాటివల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయి. ఇవి దీర్ఘకాలంలో చర్మానికి చాలా హాని కలిగిస్తాయి. మెరిసే చర్మం కోసం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవమే ముఖ్యం. ఎందుకంటే వీటిలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ ఆహారాలు మీ చర్మాన్ని హైడ్రేట్‌గా చేస్తాయి. లోపలి నుంచి గ్లోని తీసుకొస్తాయి. ఆరోగ్యకరమైన చర్మం కోసం ఏయే ఆహారాలని డైట్‌లో చేర్చుకోవాలో తెలుసుకుందాం.

1. టమోటా

టమోటాలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇందులో లైకోపీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది యాంటీ ఏజింగ్ యాంటీఆక్సిడెంట్. గుండె జబ్బులను నివారించడంలో కూడా సహాయపడుతుంది. టమోటాలోని పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి పని చేస్తాయి.

2. డార్క్ చాక్లెట్

చాక్లెట్‌లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మన చర్మాన్ని ముడతలు పడకుండా కాపాడతాయి. హానికరమైన UV కిరణాల నుంచి రక్షించడంలో సహాయపడతాయి.

3. అవిసె గింజలు

అవిసె గింజలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్ గా, మృదువుగా చేయడంలో సహాయపడుతాయి.

4. దాల్చిన చెక్క

మీరు టీ, కాఫీ లేదా ఏదైనా పానీయానికి దాల్చినచెక్కని కలుపుకొని తాగవచ్చు. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.

5. చియా విత్తనాలు

చియా గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడతాయి. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి.

6. అల్లం

అల్లంలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

7. అవకాడో

మీరు ముడతలు, పిగ్మెంటేషన్‌తో ఇబ్బంది పడుతుంటే ఆహారంలో అవకాడోను చేర్చుకోండి. ఈ పండు చాలా రుచిగా ఉంటుంది. ఇది చర్మానికి మేలు చేయడానికి సహాయపడుతుంది.

8. దోసకాయ

దోసకాయల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇందులో సిలికా ఉంటుంది. ఇది చర్మాన్ని మెరుగుపరచడంలో, చర్మాన్ని మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి