Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పేగు ఆరోగ్యం కోసం 7 అద్భుతమైన ప్రీబయోటిక్ ఆహారాలు.. వెంటనే డైట్ లో చేర్చండి..!

మనం రోజూ తినే ఆహారం మన పేగు ఆరోగ్యాన్ని బాగా ప్రభావితం చేస్తుంది. కొన్ని ఆహారాల్లో ఉండే సహజ పదార్థాలు పేగులోని మంచి బ్యాక్టీరియా పెరగడానికి తోడ్పడతాయి. అయితే ఈ రోజుల్లో ఎక్కువ మంది ఆరోగ్యకరమైన ఆహారాల కంటే త్వరగా దొరికే ఫాస్ట్‌ఫుడ్‌పై ఆధారపడుతున్నారు. దీని వల్ల పేగు సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి.

పేగు ఆరోగ్యం కోసం 7 అద్భుతమైన ప్రీబయోటిక్ ఆహారాలు.. వెంటనే డైట్ లో చేర్చండి..!
Gut Health
Prashanthi V
|

Updated on: Jul 04, 2025 | 3:48 PM

Share

పేగులో మంచి బ్యాక్టీరియా తగ్గితే జీర్ణశక్తి తగ్గి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ పరిస్థితిని మెరుగుపరచడానికి మన వంటలో వాడే సహజ పదార్థాలు ప్రీబయోటిక్స్ గా పనిచేస్తాయి. ఇవి పేగులోని మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడతాయి. పేగు ఆరోగ్యం కోసం ఈ సహజ ప్రీబయోటిక్స్ ప్రాముఖ్యతను నిపుణులు నొక్కి చెబుతున్నారు. ఇప్పుడు వారు సూచించిన కొన్ని ముఖ్యమైన ఆహార పదార్థాల గురించి వివరంగా తెలుసుకుందాం.

అరటిపండు

అరటిపండులో ఉండే ఫ్రక్టోలిగోసాకరైడ్స్ అనే పదార్థం పెద్దపేగులో కాల్షియం శోషణను మెరుగుపరుస్తుంది. ఎముకలు బలంగా ఉండటానికి కాల్షియం చాలా అవసరం. కాబట్టి రోజూ అరటిపండు తినడం కాల్షియం శోషణకు దోహదపడుతుంది.

బంగాళదుంపలు

ఉడికించిన బంగాళదుంపలు తినడం వల్ల శరీరానికి అవసరమైన, ఎక్కువ నిరోధక శక్తినిచ్చే పిండిపదార్థం (resistant starch) లభిస్తుంది. ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని, ఆకలిని నియంత్రించడంలో సహాయపడే ఒక ప్రీబయోటిక్. అంతేకాదు బంగాళదుంపలలో ఉండే ఈ పిండిపదార్థం మీ పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను నియంత్రించి పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

యాపిల్

యాపిల్‌ లో కరిగే నార పెక్టిన్ అధికంగా ఉంటుంది. ఇది పేగు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మంచి సూక్ష్మజీవుల పెరుగుదలకు మద్దతు ఇస్తుంది. యాపిల్ తినడం వల్ల పేగు సరిగా పనిచేస్తుంది.

ఓట్స్

ఓట్స్‌ లో ఉండే బీటా గ్లూకాన్ అనే కరిగే నార పేగులోని కొవ్వును తగ్గించి కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు కూడా సహకరిస్తుంది.

శనగలు

శనగల్లో పీచు ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణానికి, పేగు ఆరోగ్యానికి సహాయపడుతుంది. తరచుగా ఉడకబెట్టిన శనగలు తినడం వల్ల పేగులోని మంచి బ్యాక్టీరియాకు పోషణ లభిస్తుంది. ఇది పేగులో లాక్టోబాసిల్లస్ వంటి మంచి సూక్ష్మజీవుల పెరుగుదలను పెంచుతుంది.

వెల్లుల్లి

వంటలో ఎక్కువగా వాడే వెల్లుల్లి కూడా పేగు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. దీనిలో బ్యాక్టీరియా వ్యతిరేక లక్షణాలు ఉంటాయి. దీన్ని తరచుగా వంటలో చేర్చడం వల్ల డబుల్ ప్రీబయోటిక్ ఫైబర్స్ రూపంలో మంచి సూక్ష్మజీవుల అభివృద్ధి కూడా మెరుగుపడుతుంది.

పొద్దుతిరుగుడు విత్తనాలు

శరీరానికి చాలా మంచివి పొద్దుతిరుగుడు విత్తనాలు. వీటిలో లిగ్నిన్ లు, సెల్యులోజ్ వంటి నారలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థను సరిగ్గా పనిచేసేలా చేస్తాయి. మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

ఈ విధంగా మనం రోజువారీ వంటలో చేర్చుకునే ఈ సహజ పదార్థాలు పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఫాస్ట్‌ఫుడ్ తగ్గించి ఈ ఆరోగ్యకరమైన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ జీర్ణశక్తి బాగుంటుంది. మీరు ఆరోగ్యంగా ఉంటారు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)