Alzheimer’s Disease: అల్జీమర్స్ వ్యాధికి ఆ న్యూరాన్లే కారణం.. తాజా అధ్యయనంలో సంచలన నిజాలివే..
తాజా అధ్యయనంలో పరిశోధకులు ఈ వ్యాధికి కారణమయ్యే న్యూరాన్ల గురించి తెలుసుకున్నారు మెదడులోని హైపోథాలమస్ భాగంలో కనిపించే ఈ న్యూరాన్లను మామిల్లరీ బాడీ అంటారు. అల్జీమర్స్ వ్యాధిలో కీలకమైన లక్షణాల్లో ఒకటైన న్యూరోడెజెనరేషన్‌లో ఈ న్యూరాన్లు ప్రధాన పాత్ర పోషిస్తాయని పరిశోధనల్లో తేలింది.

మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్ల కారణంగా ప్రస్తుత కాలంలో వివిధ వ్యాధులు అందరినీ వేధిస్తున్నాయి. ముఖ్యంగా వయస్సుతో సంబంధం లేకుండా వ్యాధులు విరుచుకుపడుతున్నాయి. ప్రస్తుతం అల్జీమర్స్ వ్యాధి(మతిమరుపు) అందరినీ వేధిస్తుంది. తాజా అధ్యయనంలో పరిశోధకులు ఈ వ్యాధికి కారణమయ్యే న్యూరాన్ల గురించి తెలుసుకున్నారు మెదడులోని హైపోథాలమస్ భాగంలో కనిపించే ఈ న్యూరాన్లను మామిల్లరీ బాడీ అంటారు. అల్జీమర్స్ వ్యాధిలో కీలకమైన లక్షణాల్లో ఒకటైన న్యూరోడెజెనరేషన్‌లో ఈ న్యూరాన్లు ప్రధాన పాత్ర పోషిస్తాయని పరిశోధనల్లో తేలింది. అయితే అల్జీమర్స్ వ్యాధి మొత్తం మెదడును ప్రభావితం చేయదని మునుపటి అధ్యయనాల్లో తేలింది. కానీ ఈ అధ్యయనంతో ఈ వ్యాధి నేరుగా ఈ న్యూరాన్లతో సంబంధం కలిగి ఉందని నిర్ధారణైంది. అయితే మెదడులో అల్జీమర్స్ వ్యాధి ప్రారంభ లక్షణాలు ఉంటాయని కనుగొన్నారు. అందువల్ల ఈ పరిశోధన అల్జీమర్స్ వ్యాధి చికిత్సకు కూడా సాయం చేస్తుంది. ముఖ్యంగా మెదడు ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని మందులు వినియోగిస్తే న్యూరోడెజెనరేషన్‌ను నిరోధించడంలో సహాయపడతాయి. ఎలుకలపై జరిపిన ఒక అధ్యయనంలో మూర్ఛ చికిత్సకు ఉపయోగించే మందులను ఈ సమస్యకు వాడితే మెరుగైన ఫలితాలు ఉంటాయని తేలింది. ముఖ్యంగా వీటిని వాడితే మామిల్లరీ బాడీ న్యూరాన్‌లలో హైపర్యాక్టివిటీ, న్యూరోడెజెనరేషన్ వల్ల ఏర్పడే జ్ఞాపకశక్తి లోపాలను అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అల్జీమర్స్ వ్యాధికి చికిత్స ఇలా
ప్రస్తుతం అల్జీమర్స్ వ్యాధికి శాశ్వత నివారణ లేదు. అయితే ప్రారంభ పరిశోధనల్లో ఈ లక్షణాలను తగ్గించడంలో సహాయపడే మందులను కనుగొన్నారు. ఆందోళన, దూకుడు, భ్రమ, భ్రాంతులు వంటి లక్షణాలు తగ్గించడానికి కొన్ని మందులు వైద్యులు సూచిస్తున్నా కొన్ని చికిత్స పద్ధతుల ద్వారా వాటిని తగ్గించవచ్చని సూచిస్తున్నారు. కాగ్నిటివ్ స్టిమ్యులేషన్, కాగ్నిటివ్ రిహాబిలిటేషన్ థెరఫీ వంటి చికిత్స ద్వారా అల్జీమర్స్‌ను తగ్గించవచ్చని పేర్కొంటున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి..






