AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Life style: శరీరంలో ఈ భాగాల్లో నొప్పులా.? క్యాన్సర్‌ లక్షణాలు కావచ్చు జాగ్రత్తా..

బాడీ పెయిన్స్‌ అనేది సర్వసాధారణమైన విషయం. కాస్త పని ఎక్కువైనా, ప్రయాణం చేసినా శరీరంలో నొప్పులు వస్తుంటాయి. అయితే ఇలాంటి నొప్పులతో ఎలాంటి ప్రమాదం ఉండదు. సహజంగా వచ్చే నొప్పులే అయి ఉంటాయి. అయితే కొన్ని రకాల నొప్పులు మాత్రం..

Life style: శరీరంలో ఈ భాగాల్లో నొప్పులా.? క్యాన్సర్‌ లక్షణాలు కావచ్చు జాగ్రత్తా..
Pains
Narender Vaitla
|

Updated on: Nov 29, 2022 | 7:33 AM

Share

బాడీ పెయిన్స్‌ అనేది సర్వసాధారణమైన విషయం. కాస్త పని ఎక్కువైనా, ప్రయాణం చేసినా శరీరంలో నొప్పులు వస్తుంటాయి. అయితే ఇలాంటి నొప్పులతో ఎలాంటి ప్రమాదం ఉండదు. సహజంగా వచ్చే నొప్పులే అయి ఉంటాయి. అయితే కొన్ని రకాల నొప్పులు మాత్రం చాలా ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శరీరంలో కనిపించే కొన్ని నొప్పులు క్యాన్సర్‌కు సంకేంత కావొచ్చని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఏయే ప్రాంతాల్లో వచ్చే నొప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.? ఇప్పుడు తెలుసుకుందాం..

* నిరంతరం తలనొప్పి, స్పృహకోల్పోవడం, చేతులు, కాళ్లలో స్పర్శకోల్పోవడం, శక్తి తగ్గడం వంటి వస్తే వెంటనే అలర్ట్‌ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. ఇది బ్రెయిన్‌ ట్యూమర్‌కు ముందస్తు సూచనలు కావొచ్చని చెబుతున్నారు.

* ఛాతీలో విపరీతంగా నొప్పి ఉండడం, నిరంతంర దగ్గు, ఊపిరి ఆడకపోవడం లాంటి సమస్యలు ఉంటే ఉపిరిత్తుల క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

* రొమ్ము ప్రాంతంలో నొప్పి ఉండడం, ఆకారంలో మార్పు కనిపించడం వంటివి బ్రెస్ట్‌ క్యాన్సర్‌కు సంకేతమై ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ లక్షణం కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

* ఆహారం తీసుకున్న సమయంలో కడుపులో విపరీతమైన నొప్పి కలిగినా, ఉన్నపలంగా బరువు తగ్గడం, కడుపు ఉబ్బరం వంటివి స్టమక్‌ క్యాన్సర్‌కు ప్రాథమిక లక్షణాలుగా చెబుతున్నారు.

* మల విసజర్జన సమయంలో నొప్పిగా ఉండడం. మలంలో రక్తం రావడం, బరువు తగ్గడం వంటివి పెద్ద పేగు క్యాన్సర్‌కు లక్షణాలు కావొచ్చు.

* మూత్ర విసర్జన చేసే సమయంలో విపరీతమైన నొప్పి ఉంటే ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ అయుండొచ్చు. మూత్రంలో రక్తం రావడం యూరినరీ బ్లాడర్‌ క్యాన్సర్‌కు సూచిక కావొచ్చని చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు నిపుణుల అభిప్రాయం, సమాచారం మేరకు అందించినవి మాత్రమే. ఆరోగ్యం విషయంలో ఎలాంటి అనుమానాలు ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..