Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pollen allergy: అది మీ శరీరంలోని జొరబడిందా అంతే సంగతులు! ఈ సీజన్‪లో జాగ్రత్తగా ఉండకపోతే చాలా కష్టం..

ముఖ్యంగా చెట్లన్నీ పూలు పూసే వసంత కాలంలో గాలిలో పుప్పొడి ఎక్కువగా ఉంటుంది. ఇది గాలి ద్వారా ముక్కల్లోకి ప్రవేశించి అలర్జీని కలిగిస్తాయి.

Pollen allergy: అది మీ శరీరంలోని జొరబడిందా అంతే సంగతులు! ఈ సీజన్‪లో జాగ్రత్తగా ఉండకపోతే చాలా కష్టం..
Allergies Pollen
Follow us
Madhu

|

Updated on: Feb 18, 2023 | 1:07 PM

సీజన్ల బట్టి అలర్జీలు వస్తుంటాయి. కొందరైతే సీజన్ తో సంబంధం లేకుండా అలర్జీల బారిన పడుతుంటారు. ముఖ్యంగా దుమ్ము, ధూళి, పూలు, కాలుష్యం, చల్లటి వాతావరణం వంటి కారణంగా అలర్జీలు వ్యాపిస్తాయి. అయితే వీటిని పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కొందరిలో ఇవే చాలా ఇబ్బందిని కలుగుజేస్తాయి. ముఖ్యంగా పెంపుడు జంతువుల బొచ్చు, సౌందర్య సాధనాలు, కొన్ని రకాల వాసనలు, రసాయనాలు, పాత పుస్తకాలు తీవ్ర అలర్జీలకు కారణమవుతాయి. ముఖ్యంగా చెట్లన్నీ పూలు పూసే వసంత కాలంలో గాలిలో పుప్పొడి ఎక్కువగా ఉంటుంది. ఇది గాలి ద్వారా ముక్కల్లోకి ప్రవేశించి అలర్జీని కలిగిస్తాయి.

పుప్పొడి అలర్జీలు అంటే..

పుప్పొడి అనేది చెట్లు, గడ్డి, కలుపు మొక్కల పువ్వులలో ఉండే ఒక పొడి. ఇది మొక్కల ఫలదీకరణాన్ని ప్రోత్సహించే ఓ కణిక. పుప్పొడి కీటకాలు, లేదా గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇది ముక్కు ద్వారా శరీరం లోపలికి ప్రవేశించినప్పుడు కొన్ని రకాల లక్షణాలు మనకు కనిపిస్తాయి. ముక్కు దిబ్బెడ, సైనస్( ఇది ముఖ నొప్పికి కారణం కావచ్చు), కారుతున్న ముక్కు, కళ్ళు దురద, నీళ్ళు, గొంతు మంట, దగ్గు, కళ్ళు కింద వాపు, నీలిరంగు చర్మం, రుచి లేదా వాసన తెలియకపోవడం, ఆస్తమా వంటి లక్షణాలు కనిపిస్తాయి. అప్పటికీ జాగ్రత్తలు వహించకపోతే అది గవత జ్వరానికి దారితీస్తుంది. దీనినే సీజనల్‌ అలర్జిక్‌ రైనైటిస్‌ అంటారు. అంటే ముక్కు లోపల శ్లేష్మ పొర వాపు వస్తుంది. ఇది ఏడాది పొడవునా బాధిస్తుంది. ఇది వచ్చినప్పుడు ముక్కు కారటం, దురద, తుమ్ములు, చికాకు, కళ్లు ఎరుపరంగులోకి మారడం, చెవులు, గొంతు అంగిలిలో దురద వంటి లక్షణాలు కనిపిస్తాయి.

చికిత్స ఇలా..

మీ లక్షణాలను తగ్గించడానికి మందులు సరిపోకపోతే.. అలెర్జీ షాట్లు సిఫారసు చేస్తారు. ఇమ్యునోథెరపీలో భాగంగా ఈ షాట్లను ఇస్తారు. ఒక ప్రకారం సిరీస్ ఆఫ్ ఇంజెక్షన్లు అలర్జీతో బాధపడుతున్న వ్యక్తికి ఇస్తారు. అలాగే బయట దుమ్ము, ధూళి ఉండే ప్రదేశాలకు వెళ్లకూడదు. ఏడాదిలో కొన్ని సమయాల్లోని యాంటి అలర్జీ మందులను వినియోగించడానికి నిపుణులు సిఫారసు చేస్తారు. అలాగే మురికి ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలి. ఒక వేళ వెళ్లినా మాస్క్ ధరించాలని సూచిస్తారు.

ఇవి కూడా చదవండి

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..