AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vitamin D Food: విటమిన్‌-డి లోపంతో బాధపడతున్నారా.? ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా.? అయితే ఇలా చేయండి..

Vitamin D Food: మానవ శరీరంలో విటమిన్‌-డి కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలోని ప్రతి అవయవానికీ విటమిన్‌ డి అవసరం ఉంటుంది. అన్ని అవయవాలు సరిగ్గా పనిచేయాలంటే..

Vitamin D Food: విటమిన్‌-డి లోపంతో బాధపడతున్నారా.? ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా.? అయితే ఇలా చేయండి..
Narender Vaitla
|

Updated on: Feb 27, 2021 | 8:15 AM

Share

Vitamin D Food: మానవ శరీరంలో విటమిన్‌-డి కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలోని ప్రతి అవయవానికీ విటమిన్‌ డి అవసరం ఉంటుంది. అన్ని అవయవాలు సరిగ్గా పనిచేయాలంటే సరిపడ విటమిన్‌-డి అందుతుండాలి. అయితే నిజానికి మనుషులకు అవసరమయ్యే విటమిన్‌-డి సూర్యరక్ష్మితో అందుతుంది. అయితే మారుతోన్న జీవనశైలి, పిట్టగోడలలాంటి ఇళ్లలో నివాసం, ఎండ తగలని జీవన విధానంతో సరిపడ విటమిన్‌ అందట్లేదు. దీంతో చాలా మంది తక్కువ వయసులో విటమిన్‌-డి లోపంతో బాధపడుతున్నారు. దీంతో చాలా మంది కృత్రిమంగా ‘విటమిన్‌-డి’ని పొందడానికి ట్యాబ్లెట్లు వాడుతున్నారు. అయితే దీని వల్ల ప్రారంభంలో బాగానే ఉన్నా.. దీర్ఘకాలంలో మాత్రం సమస్యలు ఎదుర్కొనే అవకాశాలున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే మనం రోజు తీసుకునే ఆహారం ద్వారానే ‘విటమిన్‌-డి’ని పొందే వీలుంటే బాగుంటుంది. కదూ.. మరి ప్రకృతి మనకు సహజంగా అందించే ఏయో పదార్థాల్లో విటమిన్‌-డి పుష్కలంగా లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

పాల పదార్థాలు..

పాలు, పెరుగు, మజ్జిగ, ఛీజ్‌, బటర్‌, పన్నీర్‌ వంటి ఆహార పదార్థాల్లో విటమిన్‌-డి పుష్కలంగా ఉంటుంది. వీటితో పాటు ఎగ్స్‌ కూడా విటమిన్‌-డి లభిస్తుంది. ఇక గుడ్డులో ఉండే యోక్‌ను కచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే విటమిన్‌-డి ఎక్కువగా ఉండేది ఇందులోనే.

చేపలు..

డి-విటమిన్‌ పుష్కలంగా లభించే మరో ఆహార పదార్థం చేపలు. ముఖ్యంగా సాల్మన్‌, ట్యూన ఫిష్‌లలో ఎక్కువగా లభిస్తుంది. అంతేకాకుండా ఈ చేపల్లో ఉండే కాల్షియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

పుట్టగొడుగులు..

ఇటీవలి కాలంలో పుట్ట గొడుగులను ఆహారంలో భాగం చేసుకోవడం బాగా పెరిగిపోయింది. ఇక రుచిలో కూడా మేటిగా ఉండే పుట్టగొడుగుల్లో డి-విటమిన్‌ పుష్కలంగా లభిస్తుంది.

తృణ ధాన్యాలు..

గోధుమలు, రాగులు, బార్లీ, ఓట్స్‌ వంటి తృణ ధాన్యాల్లో విటమిన్‌-డి పుష్కలంగా ఉంటాయి. అయితే వీటిని ప్రాసెస్‌ చేయకుండా తీసుకుంటేనే వీటిలో ఉండే పోషక విలువలు శరీరానికి అందుతాయి.

పండ్లతో..

దానిమ్మ, బొప్పాయి వంటి పండ్లలో పుష్కలంగా విటమిన్‌-డి లభిస్తుంది. ఈ పండ్లను ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల సహజంగా విటమిన్‌-డి పొందే అవకాశాలుంటాయి.

ఆకు కూరలు..

ఆకు కూరలతో కూడా శరీరానికి అవసరమై విటమిన్‌-డి అందుతుంది. ముఖ్యంగా తోటకూర, మునగాకు వంటి ఆకు కూరలు నిత్యం తీసుకోవడం ద్వారా విటమిన్‌-డి లభిస్తుంది.

Also Read: Best Food : తల్లిదండ్రులకు సూచన.. ఎగ్జామ్స్ సమయంలో మీ పిల్లలకు పెట్టాల్సిన బెస్ట్ ఫుడ్ ఎంటో తెలుసా..

షాపులో దొరికే తేనె వాడుతున్నారా..! అయితే రోగాలు కొని తెచ్చుకుంటున్నారన్న మాట.. స్వచ్ఛమైన హనీ ఎలా ఉంటుందో తెలుసుకోండి..

Green Chillies : పచ్చిమిర్చి పక్కకు పెడుతున్నారా.. అయితే మీ ఒంట్లో ఆ శక్తి ఉండదు.. నిజాలు తెలుసుకోండి..

Follow Us
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!