Green Chillies : పచ్చిమిర్చి పక్కకు పెడుతున్నారా.. అయితే మీ ఒంట్లో ఆ శక్తి ఉండదు.. నిజాలు తెలుసుకోండి..

Health Benefits Green Chillies : పచ్చిమిరపకాయలతో వచ్చే లాభాలు తెలిస్తే ఘాటెత్తే పచ్చిమిర్చిని ఇష్టంగా లాగించేస్తారు. సాధారణంగా మిరపకాయ అంటే చాలామంది

Green Chillies : పచ్చిమిర్చి పక్కకు పెడుతున్నారా.. అయితే మీ ఒంట్లో ఆ శక్తి ఉండదు.. నిజాలు తెలుసుకోండి..
Follow us
uppula Raju

|

Updated on: Feb 27, 2021 | 5:22 AM

Health Benefits Green Chillies : పచ్చిమిరపకాయలతో వచ్చే లాభాలు తెలిస్తే ఘాటెత్తే పచ్చిమిర్చిని ఇష్టంగా లాగించేస్తారు. సాధారణంగా మిరపకాయ అంటే చాలామంది భయపడిపోతారు. కారంగా ఉంటుంది. తినలేమంటూ వంటలో వాడినా పక్కన పడేస్తుంటారు. పచ్చి మిరపకాయలను నిత్యం మనం అనేక కూరల్లో వేస్తుంటాం. ఎండు కారంకు బదులుగా వీటిని కారం కోసం చాలా మంది కూరల్లో వేస్తారు. పచ్చి మిరప వల్ల కూరలకు చక్కని రుచి వస్తుంది. ఈ క్రమంలోనే కొందరు పచ్చి మిరప కాయలను అలాగే డైరెక్ట్‌గా తింటారు. కొందరు మజ్జిగలో వీటిని ఆరగిస్తారు. అయితే నిజానికి పచ్చి మిరపకాయలు కారంగా ఉన్నప్పటికీ వాటిని రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కేప్సైసిన్‌: పచ్చి మిర్చిలో శరీరపు మెటబాలిజంను ప్రేరేపించే కేప్సైసిన్‌ (క్యాస్పేసియన్)అనే ఓ పదార్థం ఉంది. దీంతో తయారైన సప్లిమెంట్స్‌ తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగిపోతుందట. మన శరీరంలో తెలుపు, గోధుమరంగు రెండు రకాల కొవ్వులుంటాయి.

తెలుపు రంగు కొవ్వు కణాల్లో: తెలుపు రంగు కొవ్వు కణాల్లో శక్తి నిల్ల ఉంటే గోధుమ రంగు కొవ్వు కణాలు ఆ కొవ్వు కరిగేందుకు సహాయపడతాయి. కాబట్టి గోధుమ రంగు కొవ్వును అందించే పదార్థాలను ఎక్కువ తినటం వల్ల కూడా శరీరంలోని కొవ్వును కరిగించి బరువు తగ్గించుకోవచ్చని అమెరికాలోని వ్యోమింగ్‌ యూనివర్శిటీ పరిశోధకులు కూడా తెలిపారు.

జీర్ణశక్తిని పెంచుతుంది: పచ్చి మిరపకాయ జీర్ణశక్తిని పెంచుతుంది. అజీర్తిని తొలగిస్తుంది. పక్షవాతాన్ని తగ్గిస్తుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది. మిరపకాయ రుచిని కలిగించడమే కాకుండా ఆకలిని వృద్ధి పరుస్తుంది. కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. దెబ్బ తగిలినపుడు కారే రక్తాన్ని కూడా తగ్గించే శక్తి కారానికి ఉంది.

కీళ్ల నొప్పులు తగ్గుతాయి: మిరపకాయ గింజలను నువ్వుల నూనెలో కాగబెట్టి, పూతగా రాస్తుంటే కీళ్ల నొప్పులు, నడుము నొప్పులు తగ్గుముఖం పడతాయి. ఒక గ్లాసు నీటిలో గులాబీ పూలు రెండు పచ్చిమిరపకాయలు ఉడికించి ఆ నీటిని పుక్కిలలిస్తే గొంతు నొప్పికి అద్భుతంగా పనిచేస్తుంది.

పోషకాలు పుష్కలంగా ఉంటాయి: పచ్చి మిరపకాయల్లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే పచ్చి మిరపలో విటమిన్ బి6, విటమిన్ ఎ, ఐరన్, కాపర్, పొటాషియం, నియాసిన్, ఫైబర్, ఫోలేట్ వంటి పోషకాలు కూడా పుష్కలంగానే ఉంటాయి. ఇవి మన శరీరానికి పోషణను అందిస్తాయి.

జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది: పచ్చి మిరపకాయలను విత్తనాలతో సహా తింటే జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. ఉమ్మి ఎక్కువగా ఉత్పత్తి అవడం వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగవుతుంది. పచ్చిమిరప విత్తనాల్లో ఫైటోస్టెరాల్ అనే పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. పేగుల నుంచి కొలెస్ట్రాల్ రక్తంలోకి చేరకుండా చూస్తుంది. దీంతోపాటు రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.

ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది: చైనీస్‌ వంటకాల్లో పచ్చి మిరపకు ఎనలేని ప్రాముఖ్యం ఉంది. పచ్చిమిరప తినడం వల్ల శరీరంలోని అనసవర బ్యాక్టీరియా నాశనమవుతుంది. శరీర ఉష్ణోగ్రత కూడా నియంత్రణలో ఉంటుంది. విటమిన్‌-ఏ పుష్కలంగా ఉంటుంది కాబట్టి కళ్లకు మేలుచేస్తుంది. చర్మం కాంతివంతం అవుతుంది.పచ్చిమిరపలో ఉండే విటమిన్‌-సీ కారణంగా విటమిన్లను శోషించుకునే గుణం శరీరానికి లభిస్తుంది.

గుండెకు కవచం: పచ్చి మిరపకాయలు గుండెకు రక్షణ కవచంలా పనిచేస్తాయి. ప్రమాదకరమైన అథెరోస్కెల్ రోసిస్‌ను ఇది నివారిస్తుంది. రక్తంలో కొవ్వు, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గిస్తుంది. మిరపలోని రసాయనాలు దమనుల్లో కొవ్వు ఏర్పడకుండా అడ్డుకుంటాయి. అంతేకాకుండా రక్తం గడ్డకట్టేందుకు దారితీసే ప్లేట్‌లెట్ల సమూహం ఏర్పడకుండా నిరోధిస్తుంది. దీంతో హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటివి ధరిచేరవని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు.

Benefits With Garlic: చలికాలంలో వెల్లుల్లి ఎక్కువగా ఎందుకు తీసుకోవాలో తెలుసా..? ఇవీ లాభాలు..