షాపులో దొరికే తేనె వాడుతున్నారా..! అయితే రోగాలు కొని తెచ్చుకుంటున్నారన్న మాట.. స్వచ్ఛమైన హనీ ఎలా ఉంటుందో తెలుసుకోండి..

Honey Facts : తేనె మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఐతే... అది మంచి తేనె అయితేనే ఆ ప్రయోజనాలు మనం పొందగలం. అదే నకిలీ తేనెను వాడితే... ఆరోగ్యానికి

  • uppula Raju
  • Publish Date - 5:23 am, Sat, 27 February 21
షాపులో దొరికే తేనె వాడుతున్నారా..! అయితే రోగాలు కొని తెచ్చుకుంటున్నారన్న మాట.. స్వచ్ఛమైన హనీ ఎలా ఉంటుందో తెలుసుకోండి..

Honey Facts : తేనె మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఐతే… అది మంచి తేనె అయితేనే ఆ ప్రయోజనాలు మనం పొందగలం. అదే నకిలీ తేనెను వాడితే… ఆరోగ్యానికి మేలు సంగతేమోగానీ… కీడు జరగడం ఖాయం. అందువల్ల మంచి తేనె అంటే ఎలా ఉండాలో తెలుసుకుందాం. ఒకప్పుడు తేనె అంటే… పల్లెలు, తండాల నుంచీ తెచ్చి అమ్మేవారు. మరి ఇప్పుడో… తేనె బ్రాండ్లు వందల్లో ఉన్నాయి. చాలా పేరున్న కంపెనీలన్నీ తేనెను ప్యాక్ చేస్తున్నాయి. తమదే మంచి తేనె అని చెప్పుకుంటున్నాయి. కొన్ని కంపెనీలు… ఒక బాటిల్ కొంటే మరో బాటిల్ ఫ్రీ అంటున్నాయి. మరికొన్ని 50 శాతం ఎక్స్‌ట్రా అని ఊరిస్తున్నాయి. నిజానికి ఆయా కంపెనీలు అమ్ముతున్న తేనెలన్నీ ఎక్కువగా ప్రాసెస్ చేసినవే. ఇలా అధికంగా ప్రాసెస్ చేస్తే ఆ తేనె వల్ల ఏ ప్రయోజనమూ ఉండదు.

పరిశోధకులు చెబుతున్నదేంటంటే… తేనె కావాలంటే… రియల్ తేనెను కొనుక్కోవడమే బెటరంటున్నారు. నిజంగా తేనెపట్టు నుంచీ తీసిన స్వచ్ఛమైన తేనె మాత్రమే నిజమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగివుంటుంది. నిజానికి…. స్వచ్ఛమైన తేనె ఎప్పటికీ పాడవదు. కానీ… కంపెనీలు అమ్ముతున్న తేనె బాటిళ్లపై… ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. ఎందుకంటే… అది నిజమైన తేనె కాదు కాబట్టి. అది ప్రాసెస్ చేసిన తేనె కావడం వల్ల దాన్లో సహజ లక్షణాల్ని అది కోల్పోతుందన్నమాట. తేనెను ప్రాసెస్ చేసే క్రమంలో వేడి చేస్తాయి కంపెనీలు. అలా వేడి చేస్తే… తేనెలోని ఎంజైములు, ప్రోబోటిక్సులు, ఇతర పోషకాలు దెబ్బతింటాయి. బెస్ట్ తేనె అంటే… ఆర్గానిక్ (సేంద్రియ) తేనె. అంటే ఎలాంటి మందులూ ఇతరత్రా కలపని స్వచ్ఛమైన తేనె. 8వేల ఏళ్లుగా అలాంటి తేనె పల్లెటూర్లలో దొరుకుతోంది. మీకు తెలుసా… కేజీ తేనె కోసం… తేనె టీగలు 90వేల మైళ్లు ఎగురుతాయి. అంటే భూమిని మూడుసార్లు చుట్టి వచ్చినట్లే. వాటి కష్టంతో తయారయ్యే స్వచ్ఛమైన తేనెను వాడితే… ఆరోగ్యం అద్భుతంగానే ఉంటుంది.

తేనెలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్ ఉంటాయి. అందువల్ల అది రెగ్యులర్ షుగర్ కంటే తియ్యగా ఉంటుంది. తేనెలో 20 శాతం కంటే తక్కువగా నీరు కూడా ఉంటుంది. అందువల్ల తేనెలో సూక్ష్మజీవులు పెరగలేవు. తేనెలో 18 శాతం కంటే తక్కువ వాటర్ ఉంటే అది స్వచ్ఛమైన తేనె కింద లెక్క. తేనె తాజాగా ఉండాలని దాన్ని ప్రిజ్‌లో పెట్టకూడదు. అలా చేస్తే అది చక్కెరలా మారిపోతుంది. దాన్ని బయటే సీసాలో పోసి… గాలి లోపలికి వెళ్లకుండా మూత టైట్‌గా పెట్టాలి. ఇలా గైతే… కొన్ని వందల ఏళ్లు తెనెను నిల్వచేయవచ్చు. షాపుల్లో అమ్మే తేనె బాటిళ్లలో తేనెతోపాటూ… కార్న్ సిరప్ (corn syrup), పిండి, స్టార్చ్, డెక్ట్రోజ్, ప్రిజర్వేటివ్స్ (పాడవకుండా చేసే పదార్థాల్ని) కలుపుతారు. ఈ వివరాలు తేనె బాటిల్ పై రాసి ఉంటాయి. తేనె బాటిల్ కొనుక్కునేవారు వాటిని చదివి… అవి ఎంత తక్కువగా ఉంటే అంత బెటర్ అని గుర్తించాలి.

స్వచ్చమైన తేనె నల్లగా ఉంటుంది. ఏమాత్రం ఆకర్షణీయంగా ఉండదు. దాన్ని సీసాలోపోసి… చూస్తే… అవతల ఉన్న వస్తువులేవీ కనిపించవు. అదే మీరు షాపుల్లో కొనే తేనె బాటిల్‌లో చూస్తే… కొన్నిసార్లు అవతల ఉన్న వస్తువులు కనిపిస్తాయి. సో, ఈసారి మీరు కొనుక్కునే తేనె ఎంత అస్పష్టంగా, ఎంత నల్లగా ఉంటే అంత మంచిదని గుర్తించండి. తేనె అందంగా ఉందంటే… అది ఎక్కువ ప్రాసెస్ చేసినది అని తెలుసుకోండి. ఐతే… ఇక్కడే మరో సమస్య కూడా ఉంది. కాలం గడిచే కొద్దీ… తేనె రంగు ముదురుగా మారుతుంది. అందువల్ల నల్లగా ఉన్న తేనెలన్నీ మంచివని కూడా భావించలేం. ఓ స్పూన్‌తో కొద్దిగా తేనె తీసి… దాన్ని ఏదైనా ప్లేటుపై ఓ చుక్క వెయ్యాలి. అప్పుడా తేనె ఒకటే ముద్దగా ఉండాలి. లేదా ఒకటే ధారలా వెళ్లాలి. అది మంచి తేనె. అలా కాకుండా… అది చుక్కలు చుక్కలుగా విడిపోతూ ఉంటే… అది 20 శాతం కంటే ఎక్కువ నీరు ఉన్న తేనెగా గుర్తించాలి.

ఇండియాలో అమ్మే 77 శాతం తేనెలు కల్తీవే, సీఎస్‌ఈ పరిశోధనల్లో సంచలన విషయాలు వెల్లడి