Turmeric Side Effects: పసుపుతోనూ ముప్పే.. ఎక్కువ తీసుకుంటే నష్టం తప్పదు.
ఇన్ఫెక్షన్లను దూరం చేయడంలోనూ పసుపు కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే పసుపు లేకుండా ఎలాంటి వంటకాన్ని చేయలేము. పసుపులో ఉండే ప్రోటీన్, కాల్షియం, ఫైబర్, ఐరన్, కాపర్, జింక్ వంటి అనేక పోషకాలు ఇందులో ఉన్నాయి. అయితే అతి ఏదైనా అనార్థానికే దారి తీస్తుందన్నట్లు.. పసుపు కూడా ఎక్కువగా తీసుకుంటే ఆర్యోగానికి ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ పసుపును..

పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని యాంటీ బ్యాక్టిరియా గుణాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇన్ఫెక్షన్లను దూరం చేయడంలోనూ పసుపు కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే పసుపు లేకుండా ఎలాంటి వంటకాన్ని చేయలేము. పసుపులో ఉండే ప్రోటీన్, కాల్షియం, ఫైబర్, ఐరన్, కాపర్, జింక్ వంటి అనేక పోషకాలు ఇందులో ఉన్నాయి. అయితే అతి ఏదైనా అనార్థానికే దారి తీస్తుందన్నట్లు.. పసుపు కూడా ఎక్కువగా తీసుకుంటే ఆర్యోగానికి ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ పసుపును ఎక్కువగా తీసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..
* పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. పసుపును పరిమితికి మించి తీసుకుంటే కడుపు నొప్పికి దారి తీస్తుందని సూచిస్తున్నారు.
* పసుపు ఎక్కువగా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. పసుపులో ఉండే ఆక్సలేట్ మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి కిడ్నీలో రాళ్ల సమస్య ఉండే వారు పసుపును మితంగా తీసుకోవాలి.
* పసుపును ఎక్కువగా తీసుకుంటే కడుపులో వికారం పెరుగుతుంది. విరేచనాలు వేధిస్తాయి. పసుపులోని కర్కుమిన్ ఈ సమస్యలకు కారణంగా మారుతుంది.
* అలర్జీలతో బాధపడేవారు పసుపును మితంగా తీసుకోవాలి. పసుపులోని కొన్ని సమ్మేళనాలు అలర్జీని కలిగిస్తాయి.
* ఇక డయాబెటిక్‌తో బాధపడే వారు కూడా పసుపుకు వీలైనంత వరకు తక్కువగానే తీసుకోవాలి. సాధారణంగా డయాబెటిక్ బాధితుల రక్తం మందంగా ఉంటుంది. డయాబెటిక్ రోగులు దానిని పలుచన చేయడానికి మాత్రలు తీసుకుంటారు. పసుపు కూడా రక్తాన్ని పలుచన చేస్తుంది. దీంతో రక్త ప్రవాహంలో సమస్య ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు అందించనవి మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి..