Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Life style: తడి దుస్తులను ఇంట్లో ఆరబెడితే.. ఆరోగ్యంపై దుష్ప్రభావం తప్పదు.

ఫ్యాన్‌ ఆన్‌ చేసి ఇంట్లో దుస్తులను ఆరబెడుతుంటారు. ఇక బయట సరైన స్థలం లేకపోయినా ఇంట్లోనే దుస్తులు ఆరబెడుతుంటారు. అయితే ఇలా చేయడం వల్ల ఆరోగ్యంపై దుష్ఫ్రభావం పడుతుందని మీకు తెలుసా.? తడి దుస్తులు ఇంట్లో ఆరబెట్టడానికి, ఆరోగ్యానికి ఏంటి సంబధం ఏంటని ఆలోచిస్తున్నారా.? అయితే ఈ వివరాల్లోకి వెళ్లాల్సిందే.. తడి దుస్తులను ఇంట్లో ఆరబెడితే ఇంట్లో తేమ పెరుగుతుంది. దీని కారణంగా...

Life style: తడి దుస్తులను ఇంట్లో ఆరబెడితే.. ఆరోగ్యంపై దుష్ప్రభావం తప్పదు.
Wet Clothes
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 04, 2023 | 11:25 PM

చలికాలం, వర్షకాలం వచ్చిందంటే ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే వీటితో పాటు పిండిన దుస్తులను ఆరబెట్టడం కూడా ఒక సమస్య అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దుస్తులను బయట ఆరేస్తే త్వరగా ఆరవన్న కారణంతో మనలో చాలా మంది ఇంట్లోనే ఆరబెట్టుకుంటారు.

ఫ్యాన్‌ ఆన్‌ చేసి ఇంట్లో దుస్తులను ఆరబెడుతుంటారు. ఇక బయట సరైన స్థలం లేకపోయినా ఇంట్లోనే దుస్తులు ఆరబెడుతుంటారు. అయితే ఇలా చేయడం వల్ల ఆరోగ్యంపై దుష్ఫ్రభావం పడుతుందని మీకు తెలుసా.? తడి దుస్తులు ఇంట్లో ఆరబెట్టడానికి, ఆరోగ్యానికి ఏంటి సంబధం ఏంటని ఆలోచిస్తున్నారా.? అయితే ఈ వివరాల్లోకి వెళ్లాల్సిందే.. తడి దుస్తులను ఇంట్లో ఆరబెడితే ఇంట్లో తేమ పెరుగుతుంది. దీని కారణంగా ఫంగస్‌తో సహా అనేక రకాల ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

మరీ ముఖ్యంగా చిన్న పిల్లల ఆరోగ్యంపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చిన్నారుల్లో సైనస్, అలెర్జీలు న్యుమోనియాకు కారణమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఊపిరితిత్తుల ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఇదేదో అషామాషిగా చెబుతున్న విషయం కాదు.. మాంచెస్టర్‌లోని నేషనల్ ఆస్పెర్‌గిలోసిస్ పరిశోధకులు అధ్యయనం నిర్వహించి మరీ ఈ విషయాన్ని తెలిపారు.

దుస్తులను ఇంట్లో ఆరబెడితే గదిలో తేమ 30 శాతం పెరుగుతుందని, ఇది ఆర్స్పెగిల్లస్ ఫ్యూమిగేటస్ స్పోర్స్ అనే ఫంగస్ వృద్ధికి కారణమవుతుందని అధ్యయనంలో తేలింది. ఇది శ్వాసకోశ ప్రక్రియకు ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. శ్వాసనాళాలు, సైనస్, ఊపిరితిత్తులపై ఎక్కువ ప్రభావం చూపుతుంది.

దుస్తులు ఇంట్లో ఆరవేసినప్పుడు దుర్వాసన రాకుండా ఉండాలంటే.. గదిలో ఒక మూల అగరబత్తులు వెలిగించండి. కానీ దుస్తుల నుంచి దూరంగా వెలిగించండి. అగరబత్తుల నుంచి వచ్చే పొగ.. అవి త్వరగా ఆరిపోవడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా మంచి వాసన కూడా వస్తాయి. అలాగే ఉతికేటప్పుడు 2 టేబుల్ స్పూన్ల వెనిగర్ ని నీళ్లలో వేయాలి. ఇది ఇంట్లో దుర్వాసన రాకుండా చేస్తుంది. దుస్తులకు మృదుత్వాన్ని కూడా ఇస్తుంది.

ఒకవేళ తప్పని పరిస్థితుల్లో ఇంట్లో తడిసిన దుస్తులను ఆరబెట్టాల్సి వస్తే కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. దుస్తులు తడిగా ఉన్నప్పుడు వాటిలోని తేమ స్థాయిని తగ్గించడానికి ఉప్పు మంచి మార్గం. గదిలో ఓ మూలన ఉప్పును ఉంచాలి.ఇలా చేయడం వల్ల ఉప్పు తేమను గ్రహిస్తుంది. దీనిద్వారా ఫంగస్ కంట్రోల్​ అవుతుంది. ఇక దుస్తులను ఇంట్లో ఆరబెట్టాల్సి వస్తే.. నీటిని పూర్తిగా పిండిన తర్వాతే ఆరబెట్టాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..