Health tips: అలసటతో విసిగిపోయారా? ఈ ఫుడ్స్‌తో చెక్ పెట్టండి
కొందరు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ శక్తి లేకుండా అలసిపోయినట్లుగా కనిపిస్తారు. ఏ చిన్న పనిచేసినా త్వరగా అలసిపోతారు. దీనికి ప్రధాన కారణం అవసరమైన పోషకాలు శరీరానికి అందకపోవడమే. మనం ప్రస్తుత జీవనశైలి, జంక్ ఫుడ్ అలవాట్ల కారణంగా శరీరానికి అవసరమైన పోషకాలు అందడం లేదు. దీని కారణంగా అలసట వస్తుంది.

అనారోగ్యంగా ఉన్నప్పుడు అలసటగా ఉండటం సహజమే. కానీ, కొందరు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ శక్తి లేకుండా అలసిపోయినట్లుగా కనిపిస్తారు. ఏ చిన్న పనిచేసినా త్వరగా అలసిపోతారు. దీనికి ప్రధాన కారణం అవసరమైన పోషకాలు శరీరానికి అందకపోవడమే. మనం ప్రస్తుత జీవనశైలి, జంక్ ఫుడ్ అలవాట్ల కారణంగా శరీరానికి అవసరమైన పోషకాలు అందడం లేదు. దీని కారణంగా అలసట వస్తుంది. మీ శరీరానికి అవసరమైన శక్తిని అందించే పలు ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చియా సీడ్స్: చియా గింజలు శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడతాయి. వీటిలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి దీర్ఘకాలిక శక్తిని అందించడంతోపాటు కండరాల పునరుద్ధరణకు సహాయపడతాయి. అలాగే, చియా సీడ్స్‌లో ఉండే ఐరన్, మెగ్నీషియం, కాల్షియం బలహీనత, బద్ధకాన్ని తగ్గిస్తాయి. చియా విత్తనాలను నీటిలో నానబెట్టి త్రాగడం వల్ల శరీరానికి హైడ్రేషన్ లభిస్తుంది. చియా సీడ్స్ త్వరగా అలసట నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.
అరటిపండు: అరటి పండు ఆరోగ్యానికి ఎంతో మంచిది. అరటిపండ్లలో సహజ గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ ఉంటాయి, ఇవి అలసట నుంచి ఉపశమనం కలిగించడంతోపాటు శరీరానికి త్వరగా శక్తిని అందించడంలో సహాయపడతాయి. దీనిలోని పొటాషియం కంటెంట్ కండరాల బలహీనత, కండరాల తిమ్మిరిని తగ్గిస్తుంది. అరటిపండ్లలో విటమిన్ B6 కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది జీవక్రియను మెరుగుపరిచి అలసటను తొలగిస్తుంది. శరీరాన్ని ఎక్కువసేపు చురుగ్గా ఉంచుతుంది.
బాదం: బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి అలసట నుంచి ఉపశమనం కలిగిస్తాయి. బాదంలో ఉండే మెగ్నీషియం కంటెంట్ కండరాలను సడలించి బలహీనతను తగ్గిస్తుంది. బాదంలో విటమిన్ E, B-కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కణ శక్తిని పెంచడం ద్వారా అలసట, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే, వాటి యాంటీఆక్సిడెంట్ లక్షణాలు శరీరాన్ని చురుకుగా చేస్తాయి.
వాల్‌నట్స్: సూపర్ ఫుడ్‌గా పిలువబడే వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి అలసటను తగ్గించడంతోపాటు శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడతాయి. వాటి మెగ్నీషియం, ఐరన్ కంటెంట్ కండరాల బలహీనతను తగ్గిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. వాల్‌నట్స్‌లోని యాంటీఆక్సిడెంట్లు మానసిక అలసట, ఒత్తిడిని తగ్గిస్తాయి. దీని క్రమం తప్పకుండా, తీసుకోవడం వల్ల శరీరాన్ని చురుకుగా మార్చుకోవచ్చు.
ఓట్స్: ఓట్స్.. కార్బోహైడ్రేట్లకు మంచి మూలం. ఇవి అలసట నుంచి ఉపశమనం కలిగించి, శరీరాన్ని ఎక్కువసేపు చురుగ్గా ఉంచుతాయి. దీనిలోని ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడానికి సహాయపడుతుంది. ఓట్స్‌లో ఇనుము, మెగ్నీషియం, బీ విటమిన్లు కూడా ఉంటాయి, ఇవి కండరాలు, నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తాయి, మానసిక, శారీరక అలసటను తగ్గిస్తాయి.
గ్రీన్ టీ: అలసటను దూరంలో చేయడంలో మరో పదార్థం గ్రీన్ టీ. అధిక పని వల్ల అలసట, ఒత్తిడి రెండూ వస్తాయి. మీరు కూడా ఈ రకమైన అలసటను అనుభవిస్తుంటే.. ఈ సమయంలో గ్రీన్ టీ తాగితే మంచిది. ఇది త్వరిత శక్తిని అందించడంచంతోపాటు ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. ఇక, తరచూ అలసటకు గురవుతూ ఉంటే వైద్యులను సంప్రదించడం మంచిది.
