AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: మీలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా..? అయితే మీరు హైబీపీ బారిన పడినట్లే.. ముందే జాగ్రత్త పడండి..

Health: చాలా మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో రక్తపోటు ఒకటి. మారుతోన్న జీవన శైలి, ఆహార అలవాట్ల కారణంగా ఇటీవల హైబీపీ అనేది ఒక సాధారణ అంశంగా మారిపోయింది. అయితే హైబీపీని అశ్రద్ధ చేస్తే మాత్రం..

Health: మీలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా..? అయితే మీరు హైబీపీ బారిన పడినట్లే.. ముందే జాగ్రత్త పడండి..
Narender Vaitla
| Edited By: Ravi Kiran|

Updated on: Dec 14, 2021 | 6:57 AM

Share

Health: చాలా మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో రక్తపోటు ఒకటి. మారుతోన్న జీవన శైలి, ఆహార అలవాట్ల కారణంగా ఇటీవల హైబీపీ అనేది ఒక సాధారణ అంశంగా మారిపోయింది. అయితే హైబీపీని అశ్రద్ధ చేస్తే మాత్రం మొదటికే మోసం వస్తుందని మీకు తెలుసా.? అధిక రక్తపోటును నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో గుండె జబ్బులు, స్ట్రోక్స్‌ వచ్చే ప్రమాదం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే హైబీపీ అటాక్‌ అయిన వెంటనే గుర్తించి తగిన విధంగా చికిత్స తీసుకుంటే.. ప్రమాద తీవ్రతను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి హైబీపీ ఉందని చెప్పే లక్షణాలు ఏంటో తెలుసుకుందామా…

* రక్తపోటు ఉన్న వారికి కొన్నిసార్లు మైకం కమ్మినట్లు అనిపిస్తుంది. ఎప్పుడూ మత్తుగా ఉంటుంది. ముఖ్యంగా సరిపడ నిద్ర ఉన్నప్పుడు కూడా మత్తుగా ఉంటే హైబీపీగా అనుమానించాల్సి ఉంటుంది.

* బీపీ మ‌రీ ఎక్కువ‌గా ఉంటే చూపు స‌రిగ్గా ఉండ‌దు. వస్తువులు మ‌సక‌గా కనిపిస్తుంటాయి. అలాగే వీరిలో కంగారు, ఆందోళ‌న‌, అల‌స‌ట‌, నిద్రలేమి స‌మ‌స్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి.

* బీపీ ఎక్కువగా ఉన్న వారిలో కొన్ని సార్లు ముఖమంతా ఉబ్బిపోయిన‌ట్లు క‌నిపిస్తుంది. ముఖం ఎర్రగా మారుతుంది. ముఖంలో ఉండే ర‌క్తనాళాలు వెడ‌ల్పుగా మారి ర‌క్తం ఎక్కువ‌గా ప్రస‌రిస్తుంది. దీంతో ముఖం ఎర్రగా మారుతుంది.

* హైబీపీతో బాధపడేవారికి కొన్ని సార్లు ముక్కులోంచి రక్తం వస్తుంటుంది. సాధారణంగా వేడి చేసినా ఇలాగే జరుగుతుంది కానీ.. పదే పదే ఇలాగే జరిగితే మాత్రం వైద్యులను సంప్రదించాలి.

* ఇక హైబీపీ ఉన్నవారికి క‌డుపులో వికారంగా అనిపిస్తుంది. మూత్రం త‌క్కువ‌గా వ‌స్తుంది. చేతులు, పాదాలు, ఇత‌ర భాగాల్లో స్పర్శ కోల్పోయి మొద్దు బారిన‌ట్లు అనిపిస్తుంది.

* హైబీపీ మ‌రీ ఎక్కువైతే కొంద‌రికి మూర్ఛ కూడా వ‌స్తుంది. శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. వీటిలో ఏ లక్షణం కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం ఉత్తమమం.

Also Read: Firing in America: అమెరికాలో పండగ సంబరాల్లో కాల్పులు.. ఒకరి మృతి.. 13 మందికి గాయాలు..

Cabbage Side Effects: ఈ వ్యక్తులు క్యాజేజీని అస్సలు తినకూడదట.. ఎందుకో తెలుసుకోండి..

Crime News: సాయం చేయడానికి వచ్చి వృద్ధురాలిని చంపాడు.. బాలుడి ఘాతుకం.. అసలేమైందంటే..?