Health News: స్థూలకాయ సమస్యకి 2 ప్రత్యేక సర్జరీలు.. వీటివల్ల లాభమా.. నష్టమా..?
Health News: సమయపాలన లేని ఆహారపు అలవాట్ల వల్ల ప్రజల్లో ఊబకాయం విపరీతంగా పెరుగుతోంది. దీనిని వదిలించుకోవడానికి ప్రజలు అనేక పద్ధతులను ఆశ్రయిస్తున్నారు.
Health News: సమయపాలన లేని ఆహారపు అలవాట్ల వల్ల ప్రజల్లో ఊబకాయం విపరీతంగా పెరుగుతోంది. దీనిని వదిలించుకోవడానికి ప్రజలు అనేక పద్ధతులను ఆశ్రయిస్తున్నారు. అయినా ఫలితాలు కనిపించకపోవడంతో శస్త్రచికిత్సలు చేయించుకుంటున్నారు. ఇలా సర్జరీని ఆశ్రయించి ఫిట్‌గా కనిపించాలనుకునే వారి సంఖ్య ఆసుపత్రుల్లో విపరీతంగా పెరుగుతోంది. స్థూలకాయాన్ని తగ్గించే శస్త్ర చికిత్స చేయించుకునే ముందు దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడం అవసరం.
బేరియాట్రిక్ సర్జరీ
వైద్యుల ప్రకారం స్థూలకాయాన్ని తగ్గించడానికి ప్రధానంగా రెండు రకాల శస్త్రచికిత్సలు ఉన్నాయి. అందులో ఒకటి బేరియాట్రిక్ సర్జరీ కాగా రెండోది లైపోసక్షన్ సర్జరీ. అయితే ప్రతి ఊబకాయం ఈ శస్త్రచికిత్సల ద్వారా నయం కాదు. స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి శస్త్రచికిత్స చేయించుకునే ముందు శరీరంలోని బిఎమ్‌ఐ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. BMI (బాడీ మాస్ ఇండెక్స్) 31 కంటే ఎక్కువగా ఉండి, చాలా ప్రయత్నాలు చేసినా బరువు తగ్గించలేని వ్యక్తులకు బేరియాట్రిక్ సర్జరీ చేస్తారు. ఈ శస్త్రచికిత్సలో రోగి కడుపు, పేగులలో కొన్ని మార్పులు చేస్తారు. దీని కారణంగా రోగి బరువు తగ్గడం ప్రారంభమవుతుంది.
శరీర ఆకృతి కోసం లైపోసక్షన్ సర్జరీ BMI సాధారణంగా ఉన్న వ్యక్తులకు లైపోసక్షన్ సర్జరీ చేస్తారు. చాలా ఊబకాయం ఉన్నవారికి ఈ శస్త్రచికిత్స చేయలేరు. లైపోసక్షన్ అనేది సౌందర్య ప్రయోజనాల కోసం ప్రత్యేకంగా చేసే శస్త్రచికిత్స. దీని ద్వారా తొడ, పొత్తికడుపు చుట్టూ స్థూలకాయం తగ్గిస్తారు. చాలా ఎక్కువ BMI ఉన్నవారు ఈ శస్త్రచికిత్స చేయించుకోకూడదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో లైపోసక్షన్ కారణంగా కొవ్వు గ్లోబుల్స్ ఊపిరితిత్తులలోకి వెళుతుంది. ఇది జీవితానికి పెద్ద ముప్పు కలిగిస్తుంది. అయినప్పటికీ ఇటువంటి కేసులు చాలా అరుదుగా ఉంటాయి.