- Telugu News Photo Gallery Copper water benefits: Remember these things when drinking water from a copper pot
Copper Water: మీరు రాగి పాత్రలోని నీరు తాగుతున్నారా..? అయితే ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి
Copper Water Bottle Benefits: రాగి పాత్రలోని నీరు తాగితే.. ఎన్నో అనారోగ్య సమస్యలు నయమవుతాయి. అందుకే రాగి పాత్రలోని నీరు తాగితే.. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండవచ్చని పేర్కొంటుటారు. అయితే.. కొన్ని రకాల అనారోగ్య సమస్యలున్న వారు రాగి పాత్రల్లోని నీరు తాగితే.. ఆ సమస్యలు మరింత తీవ్రమవుతాయి. అలాంటి జబ్బులతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించడం మేలు.
Updated on: Nov 23, 2021 | 8:22 PM

కడుపులో పుండ్లు, అల్సర్, అసిడిటీ సమస్యలతో బాధపడుతుంటే ఆయుర్వేద నిపుణుల సలహా లేకుండా రాగి పాత్రలోని నీటిని తాగొద్దు. రాగి వల్ల వేడి ఉత్పన్నమవుతుంది. ఇది మీ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది.

కిడ్నీ లేదా గుండెకు సంబంధించిన సమస్యలుంటే ఈ నీటిని తాగే ముందు వైద్యుడిని సంప్రదించడం మేలు. రాగి పాత్రలోని నీరు తాగడం వల్ల మీ సమస్యలు మరింత పెరిగే ప్రమాదముంది.

మీకు ఆరోగ్యం బాగా ఉంటే.. ఎలాంటి సమస్యలు లేకపోతే.. రాగి పాత్రలోని నీటిని తాగాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అయితే.. రాగి పాత్రలో వండిన ఆహారపదార్థాలను అస్సలు తినకూడదు. ఇలా చేస్తే ఆరోగ్యానికి హాని కలుగుతుంది.

రాగి పాత్రలో పాలు లేదా పాల ఉత్పత్తులు, పుల్లని పదార్ధాలను ఎప్పుడు కూడా తినకూడదు. ఎందుకంటే.. ఇలా చేయడం వల్ల పదార్థాలు విషపూరితంగా మారతాయని సూచిస్తున్నారు. దీంతో అనారోగ్య సమస్యలు మరింత పెరుగుతాయి.





























