- Telugu News Photo Gallery If you want to make short nails appear longer then these hacks can be useful
Short Nails: మీ చేతికున్న చిన్న గోళ్లని పొడవుగా చూపించాలనుకుంటున్నారా..! ఈ టిప్స్ పాటించండి..
Short Nails: మీ గోర్లు పొట్టిగా ఉన్నాయని చింతిస్తున్నారా.. మరేం పర్వాలేదు. ఇప్పుడు వాటిని పొడవుగా చూపించవచ్చు. వాటిని బాదం
Updated on: Nov 23, 2021 | 8:45 PM

మీ గోర్లు పొట్టిగా ఉన్నాయని చింతిస్తున్నారా.. మరేం పర్వాలేదు. ఇప్పుడు వాటిని పొడవుగా చూపించవచ్చు. వాటిని బాదం ఆకారం లేదా గుండ్రని ఆకారంలా చేస్తే మీ పని సులువుగా అయిపోతుంది.

మీ గోళ్ల వెనకున్న క్యూటికల్స్‌ను వెనక్కి లాగడం ద్వారా మీ గోర్లు పొడవుగా కనిపించేలా చేయవచ్చు. అంతేకాదు మీరు నెయిల్ పెయింట్ వేయడానికి ఎక్కువ స్థలాన్ని పొందుతారు. గోర్లు విశాలంగా కనిపిస్తాయి. కానీ క్యూటికల్స్‌ని తీసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి.

చాలా మంది అమ్మాయిలు నెయిల్స్‌పై పెయింట్ వేసుకుంటారు. దీంతో గోళ్లు పొడవుగా కనిపిస్తాయి. డార్క్ నెయిల్ పెయింట్ మీ గోళ్లను పొట్టిగా కనిపించేలా చేస్తుంది. అందుకే దీనికి దూరంగా ఉంటే మంచిది.

చాలా రకాల నెయిల్ ఆర్ట్ ఉంటాయి. దీని ద్వారా మీరు చిన్న గోర్లు పొడవుగా కనిపించేలా చేయవచ్చు. చిన్న చుక్కలు లేదా డిజైన్‌లను ఎంచుకుంటే మీ గోళ్లు పొడవుగా కనిపిస్తాయి.





























