Weight Loss: డైటింగ్ చేయకుండా బరువు తగ్గవచ్చు..! ఈ 4 సులభమైన మార్గాలు తెలుసుకోండి..
Weight Loss: బరువు పెరిగిన వెంటనే చాలామంది టెన్షన్‌కి గురవుతారు. ఎందుకంటే పెరిగిన బరువును ఎలా తగ్గించుకోవాలా అని మదనపడుతారు. వెంటనే డైటింగ్ ప్రారంభిస్తారు.
Weight Loss: బరువు పెరిగిన వెంటనే చాలామంది టెన్షన్‌కి గురవుతారు. ఎందుకంటే పెరిగిన బరువును ఎలా తగ్గించుకోవాలా అని మదనపడుతారు. వెంటనే డైటింగ్ ప్రారంభిస్తారు. అయితే డైటింగ్ లేకుండా కూడా బరువు తగ్గవచ్చని మీకు తెలుసా..? ఈ విషయం మిమ్మల్ని కొంచెం ఆశ్చర్యపరుస్తుంది కానీ ఇది నిజమే. దానికి ఈ పద్దతులను అవలంభిస్తే సరిపోతుంది.
1. ప్రొటీన్లు పుష్కలంగా ఉన్న అల్పాహారం తీసుకోవాలి బరువు తగ్గడానికి మనం అల్పాహారం మానేస్తాం ఇలా ఎప్పుడు చేయవద్దు. ప్రతిరోజు అల్పాహారం తినాలి. కానీ అందులో ఎక్కువ ప్రోటీన్లు ఉండే వాటిని చేర్చాలి. ప్రోటీన్ జీవక్రియను మెరుగుపరుస్తుంది. బ్రేక్‌ఫాస్ట్‌గా ఏది తీసుకున్నా అందులో ప్రొటీన్ ఉండాలి. మీరు మీ అల్పాహారంలో లీన్ మీట్, పప్పులు, మొలకలు, చికెన్ బ్రెస్ట్, సాల్మన్ ఫిష్, గుడ్డు, టోఫు, సోయా పాలు, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు, బీన్స్ మొదలైన వాటిని తినవచ్చు.
2. ఏది తిన్నా బాగా నమిలి తినండి మనం ఆహారం త్వరగా తింటాం కానీ ఇలా చేయకూడదు. మీరు ఏది తిన్నా దానిని మెత్తగా నమిలి తినాలి. ఎందుకంటే లాలాజలంలోని ఎంజైమ్‌ల వల్ల జీర్ణక్రియ ప్రారంభమవుతుంది. అటువంటి పరిస్థితిలో నమలడం చాలా ముఖ్యం. దీనివల్ల తక్కువ ఆహారం తీసుకుంటారు.
3. స్నాక్స్ తినడం మానుకోండి ఇంట్లో పని చేస్తున్నప్పుడు తరచుగా బోరింగ్‌గా అనిపిస్తుంది. దీని కారణంగా ఎక్కువగా స్నాక్స్ తింటాం. ఈ చెడు అలవాటు వల్ల బరువు పెరుగుతారు. తక్కువ కేలరీల ఆహారాలు తినండి. ఎందుకంటే వీటివల్ల బరువు పెరగరు. ప్రతిరోజు గ్రీన్ టీ, హెర్బల్ టీ తాగితే మంచిది. ఎందుకంటే గ్రీన్ టీలో ఉండే క్యాటెచిన్స్ జీవక్రియను పెంచుతాయి. ఇది శరీరంలో ఉండే క్యాలరీలను వేగంగా కరిగించడంలో సహాయపడుతుంది.
4. ఆహారంలో ఫైబర్ చేర్చండి ఫైబర్‌లో కేలరీలు ఉండవు. అటువంటి పరిస్థితిలో ఫైబర్ అధికంగా ఉండే వాటిని తీసుకోవడం ద్వారా పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. చాలా సమయం పాటు కడుపు నిండుగా ఉంటుంది. దీనివల్ల మీరు ఒక్కోసారి ఏమీ తినరు. దీని కోసం అల్పాహారంలో ఓట్స్ తీసుకోవాలి. ఇందులో ఫైబర్‌తో పాటు ఇతర పోషకాలు ఉంటాయి.