పోస్టాఫీసులోని ఈ 3 పథకాలలో పెట్టుబడి పెట్టండి.. ఫిక్స్‌డ్ డిపాజిట్ కంటే ఎక్కువ వడ్డీ పొందండి..
Post Office: ప్రస్తుతం ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డి) వడ్డీ రేట్లు కనిష్ట స్థాయిలో ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా FD కంటే మీ పెట్టుబడిపై ఎక్కువ
Post Office: ప్రస్తుతం ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డి) వడ్డీ రేట్లు కనిష్ట స్థాయిలో ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా FD కంటే మీ పెట్టుబడిపై ఎక్కువ రాబడిని పొందాలనుకుంటే కిసాన్ వికాస్ పత్ర, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్, పోస్ట్ ఆఫీస్ మంత్లీ సేవింగ్ పథకం మీకు బెస్ట్. ఈ ప్లాన్‌లపై FD కంటే ఎక్కువ వడ్డీని పొందవచ్చు అంతేగాక మీ డబ్బు కూడా సురక్షితంగా ఉంటుంది.
1. కిసాన్ వికాస్ పత్ర (KVP) ప్రస్తుతం కిసాన్ వికాస్ పత్ర (కెవిపి) పొదుపు పథకంపై 6.9% వడ్డీ చెల్లిస్తున్నారు. KVPలో పెట్టుబడి పెట్టడానికి కనీసం వేయి రూపాయాలు, గరిష్టం పరిమితి లేదు ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. పెట్టుబడిదారుడి వయస్సు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి. సింగిల్ అకౌంట్‌తో పాటు జాయింట్ అకౌంట్ సౌకర్యం కూడా ఉంది. మైనర్లు కూడా ఈ పథకంలో చేరవచ్చు కానీ తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం. మీరు మీ పెట్టుబడిని ఉపసంహరించుకోవాలనుకుంటే కనీసం 2.5 సంవత్సరాలు వేచి ఉండాలి. దీని లాక్-ఇన్ పీరియడ్ రెండున్నరేళ్లు. ఇందులో ఆదాయపు పన్ను చట్టం 80సీ కింద రూ.1.5 లక్షల వరకు డిపాజిట్లపై పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇది 6.9% వడ్డీని పొందుతుంది. కాబట్టి మీరు రూల్ 72 ప్రకారం ఈ పథకంలో పెట్టుబడి పెడితే డబ్బు రెట్టింపు కావడానికి 10 సంవత్సరాల 5 నెలల సమయం పడుతుంది.
2. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC)లో పెట్టుబడికి 6.8% వార్షిక వడ్డీ లభిస్తుంది. ఇందులో వార్షిక ప్రాతిపదికన వడ్డీని లెక్కిస్తారు. అయితే పెట్టుబడి కాలం తర్వాత మాత్రమే వడ్డీ మొత్తం చెల్లిస్తారు. ఇందులో ఆదాయపు పన్ను చట్టం 80సీ కింద రూ.1.5 లక్షల వరకు డిపాజిట్లపై పన్ను మినహాయింపు లభిస్తుంది. NSC ఖాతాను తెరవడానికి మీరు కనీసం రూ.1000 పెట్టుబడి పెట్టాలి. ఈ ఖాతాను మైనర్ పేరు మీద తెరవవచ్చు 3 పెద్దల పేరుతో ఉమ్మడి ఖాతాను తెరవవచ్చు. మీరు ఎన్‌ఎస్‌సిలో ఎంత మొత్తాన్ని అయినా పెట్టుబడి పెట్టవచ్చు. పెట్టుబడి పరిమితి లేదు. ఇది 6.8% వడ్డీని పొందుతుంది. కాబట్టి మీరు రూల్ 72 ప్రకారం ఈ పథకంలో పెట్టుబడి పెడితే డబ్బు రెట్టింపు కావడానికి 10 సంవత్సరాల 7 నెలల సమయం పడుతుంది.
3. నెలవారీ ఆదాయ పథకం ఈ పథకం కింద కనీసం రూ.1000తో ఖాతా తెరవవచ్చు. మీకు ఒకే ఖాతా ఉంటే మీరు గరిష్టంగా రూ.4.5 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. మరోవైపు మీకు ఉమ్మడి ఖాతా ఉంటే గరిష్టంగా రూ.9 లక్షలు జమ చేయవచ్చు. మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు. ఈ పథకం కింద వడ్డీ వార్షిక ప్రాతిపదికన చెల్లిస్తారు. అయితే ఇది త్రైమాసిక ప్రాతిపదికన ఉంటుంది. ఈ ఖాతాను మైనర్ పేరు మీద తెరవవచ్చు 3 పెద్దల పేరుతో ఉమ్మడి ఖాతాను తెరవవచ్చు. పోస్టాఫీసు నెలవారీ ఆదాయ ఖాతాను తెరవడానికి మీరు మీ సమీపంలోని పోస్టాఫీసును సంప్రదించవచ్చు. ఇది 6.6% వడ్డీని పొందుతుంది. కాబట్టి మీరు రూల్ 72 ప్రకారం ఈ పథకంలో పెట్టుబడి పెడితే డబ్బు రెట్టింపు కావడానికి 10 సంవత్సరాల 11 నెలల సమయం పడుతుంది.