Petrol Price: వ్యూహాత్మక నిల్వల నుంచి ముడి చమురు విడుదల చేయనున్న ప్రభుత్వం.. పెట్రోల్ ధరలు తగ్గే అవకాశం!
పెరుగుతున్న ముడి చమురు ధరలను ఎదుర్కోవటానికి, భారతదేశం తన వ్యూహాత్మక చమురు నిల్వ నుండి 5 మిలియన్ బ్యారెళ్లను విడుదల చేయనుంది. ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు ఈ విషయాన్ని మంగళవారం వెల్లడించారు.
Petrol Price: పెరుగుతున్న ముడి చమురు ధరలను ఎదుర్కోవటానికి, భారతదేశం తన వ్యూహాత్మక చమురు నిల్వ నుండి 5 మిలియన్ బ్యారెళ్లను విడుదల చేయనుంది. ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు ఈ విషయాన్ని మంగళవారం వెల్లడించారు. త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. భారతదేశం, జపాన్‌తో సహా ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థల సహకారంతో ముడి చమురు అత్యవసర స్టాక్‌ను విడుదల చేయడానికి అమెరికా ప్రణాళిక వేసింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గే అవకాశం ఉంది.
2 నుంచి 3 రూపాయల వరకూ తగ్గవచ్చు..
కేడియా కమోడిటీ డైరెక్టర్ అజయ్ కేడియా మాట్లాడుతూ పెట్రోలియం కంపెనీలకు తగ్గుతున్న క్రూడ్ ప్రయోజనం వల్ల సామాన్య ప్రజలకు ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 2 నుండి 3 రూపాయల మేర తగ్గే అవకాశం ఉందని అన్నారు. అయితే రానున్న రోజుల్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ బలహీనపడితే ధరలు తగ్గడం కష్టమే.
క్రూడ్ ధరను 70 డాలర్ల వరకూ తీసుకురావడం కోసం..
మార్కెట్‌లో చమురు సరఫరాను పెంచడానికి వ్యూహాత్మక చమురు నిల్వను విడుదల చేస్తున్నట్లు ఇంధన నిపుణుడు నరేంద్ర తనేజా తెలిపారు. అమెరికా, భారత్, దక్షిణ కొరియా, జపాన్‌లు ముడి చమురు ధరలను బ్యారెల్‌కు 70 డాలర్లకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాయి. క్రూడ్ ధర 70 డాలర్లకు చేరితే, పెట్రోల్-డీజిల్, ఎల్‌పిజి ధరల తగ్గింపు రూపంలో భారతీయ వినియోగదారునికి కూడా ప్రయోజనం ఉంటుంది.
MRPL.. HPCLలకు..
భారతదేశం తూర్పు- పశ్చిమ తీరంలో మూడు ప్రదేశాలలో సుమారు 38 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును కలిగి ఉంది. ఇందులో 5 మిలియన్ బ్యారెళ్లను 7-10 రోజుల్లో విడుదల చేయనున్నారు. ఈ స్టాక్‌ను మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (MRPL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)లకు విక్రయించనున్నారు. ఈ రెండు రిఫైనరీలు పైప్‌లైన్ ద్వారా వ్యూహాత్మక రిజర్వ్‌కు అనుసంధానించబడ్డాయి. “మరింత స్టాక్ కూడా తరువాత విడుదల కావచ్చు” అని ఆ అధికారి తెలిపారు. మరోవైపు, చైనా కూడా వ్యూహాత్మక నిల్వల నుంచి చమురును విడుదల చేసేందుకు సన్నాహాలు చేసింది.
యుఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ అంటువ్యాధి తగ్గిన తర్వాత ముడి చమురు కోసం పెరిగిన డిమాండ్ కారణంగా సరఫరాను పెంచాలని పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ ప్లస్ (OPEC +) ను కోరారు. కానీ OPEC+ బిడెన్ సూచనను పట్టించుకోలేదు. దీని తరువాత, బిడెన్ ఇతర దేశాలతో వ్యూహాత్మక చమురు రిజర్వ్ నుండి చమురును విడుదల చేయడానికి ఒక ప్రణాళికను రూపొందించింది. ఈ విధంగా, చరిత్రలో తొలిసారిగా దేశాలన్నీ కలిసి చమురును విడుదల చేయనున్నాయి.
OPEC – OPEC + దేశాలు OPEC దేశాలు
చమురు ఎగుమతి చేసే దేశాలను OPEC + దేశాలు అంటారు. ఒపెక్+లో రష్యా, ఒమన్, మెక్సికో, మలేషియా సహా 10 దేశాలు ఉన్నాయి. ఒపెక్‌లో ఇరాన్, ఇరాక్, యుఎఇ, సౌదీతో సహా 13 దేశాలు ఉన్నాయి.
పెట్రోలు-డీజిల్ ధరలు తగ్గవచ్చు
ముడి చమురు ప్రస్తుతం బ్యారెల్‌కు 80 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా, భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు వ్యూహాత్మక నిల్వల నుంచి చమురును విడుదల చేస్తే.. ముడి చమురు ధరలు తాత్కాలికంగా తగ్గే అవకాశం ఉందని ఇంధన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీని ప్రత్యక్ష ప్రభావం భారతదేశంలోని పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా కనిపిస్తుంది. పెట్రోలు, డీజిల్ ధరలు కాస్త తగ్గే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి: Vodafone Idea Tariff Hike: కస్టమర్లకు షాకివ్వనున్న వొడాఫోన్ ఐడియా.. భారం కానున్న ప్రీపెయిడ్ ప్లాన్‌లు.. ఎప్పటి నుంచో తెలుసా?