AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: టీమ్‌ ఇండియాని చిక్కుల్లో పడేసేందుకు ప్రయత్నిస్తున్న న్యూజిలాండ్‌.. ఎలాగంటే..?

IND vs NZ: టీ20 సిరీస్ తర్వాత ఇప్పుడు భారత్, న్యూజిలాండ్ జట్లు టెస్టు సిరీస్‌లో తలపడనున్నాయి. అయితే దీనికి ముందు కివీస్ జట్టు కోచ్ గ్యారీ స్టెడ్ టీమ్‌ ఇండియాని చిక్కుల్లో

IND vs NZ: టీమ్‌ ఇండియాని చిక్కుల్లో పడేసేందుకు ప్రయత్నిస్తున్న న్యూజిలాండ్‌.. ఎలాగంటే..?
New Zealan
uppula Raju
|

Updated on: Nov 23, 2021 | 5:31 PM

Share

IND vs NZ: టీ20 సిరీస్ తర్వాత ఇప్పుడు భారత్, న్యూజిలాండ్ జట్లు టెస్టు సిరీస్‌లో తలపడనున్నాయి. అయితే దీనికి ముందు కివీస్ జట్టు కోచ్ గ్యారీ స్టెడ్ టీమ్‌ ఇండియాని చిక్కుల్లో పడేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇండియా ప్లేయర్లపై స్పిన్నర్లును ప్రయోగించాలని అనుకుంటున్నాడు. నవంబర్ 25 నుంచి కాన్పూర్‌లో ప్రారంభమయ్యే తొలి టెస్టు కోసం ప్లేయింగ్ ఎలెవన్‌లో ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లు ఉండవచ్చని అంచనా. ఇందులో ముంబైలో జన్మించిన ఎడమచేతి వాటం స్పిన్నర్ ఐజాజ్ పటేల్ దాదాపు ఖాయం.

కివీ జట్టు కోచ్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఇతర జట్లు ఇండియాకి వచ్చి గెలవకపోవడానికి కారణాన్ని కనుగొనాలి. నలుగురు ఫాస్ట్ బౌలర్లు, పార్ట్ టైమ్ స్పిన్నర్‌తో ఆడే సంప్రదాయ పద్ధతి ఇక్కడ విజయవంతం కాదు. ఈ టెస్ట్‌ సిరీస్‌లో ముగ్గురు స్పిన్నర్లు ఆడటం మీరు చూడొచ్చు. పిచ్‌ను పరిశీలించిన తర్వాతే ఈ విషయంపై ఫైనల్‌ నిర్ణయం తీసుకుంటాం. టెస్టు క్రికెట్ ప్రాథమిక సూత్రం అలాగే ఉంటుందని అయితే పరిస్థితులను బట్టి విధానం మార్చాల్సి ఉంటుందని స్టెడ్ చెప్పాడు.

జట్టు గురించి చెప్పాలంటే ముందుగా ఆడే విధానాన్ని మార్చుకోవాలి. కానీ టెస్ట్ క్రికెట్ సూత్రాలకు కట్టుబడి ఉండటం అవసరం. ఈసారి తేడా ఏమిటంటే రెండు వేర్వేరు ప్రదేశాలలో టెస్ట్ మ్యాచ్‌లు ఆడవలసి ఉంటుంది. ఇంగ్లండ్‌ ఒకే మైదానంలో రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చింది. కాన్పూర్‌లోని పిచ్ నల్లమట్టి అయితే ముంబైలో ఎర్ర నేల కావడంతో రెండు మైదానాల్లో పరిస్థితులు మాకు చాలా భిన్నంగా ఉంటాయని తెలుసని’ చెప్పాడు.

Airtel, Vodafone Idea లలో ఇప్పుడు ఎవరు బెస్ట్.. కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను పరిశీలించండి..

India vs New Zealand: టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బ.. కాన్పూర్‌ టెస్ట్‌కి కీలక ఆటగాడు దూరం..

చలికాలంలో గొంతు నొప్పి వస్తే చాలా జాగ్రత్త..! ఆ వ్యాధి లక్షణం కావొచ్చు.. ఆలస్యమైతే సర్జరీయే..?