భయంకర బంతులు.. చేయి పగిలిపోయింది.. బ్యాట్‌ కింద పడింది.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు..

Cricket News: ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ షెఫీల్డ్ షీల్డ్‌లో తొలిరోజు మ్యాచ్ ఎంత త్వరగా ప్రారంభమైందో అంతే త్వరగా ముగించింది. ఈ మ్యాచ్

భయంకర బంతులు.. చేయి పగిలిపోయింది.. బ్యాట్‌ కింద పడింది.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు..
Marnus

Cricket News: ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ షెఫీల్డ్ షీల్డ్‌లో తొలిరోజు మ్యాచ్ ఎంత త్వరగా ప్రారంభమైందో అంతే త్వరగా ముగించింది. ఈ మ్యాచ్ క్వీన్స్‌లాండ్ vs సౌత్ ఆస్ట్రేలియా మధ్య జరిగింది. వర్షం కారణంగా ఆట ఆలస్యంగా ప్రారంభమైంది. కానీ ఆ తర్వాత మైదానంలో కనిపించిన దృశ్యాలు వామ్మో అనిపించాయి. తొలి సెషన్ తర్వాతే ఆట ముగించాల్సి వచ్చింది. ఇలా ఎందుకు జరిగిందో మీరు ఆలోచిస్తూ ఉండాలి. పిచ్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

నిజానికి అడిలైడ్‌లోని రాల్టన్ ఓవల్‌లో ఈ మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ పిచ్‌పై అదిరిపోయే బౌన్స్ ఉంది. ఈ బౌన్స్ బ్యాట్స్‌మన్‌ పాలిట గండంగా మారింది. బౌలర్ చేతుల్లో నుంచి బంతులు ప్రాణాంతకంగా వస్తున్నాయి. దీని కారణంగా ఆట ఆడటం కష్టంగా మారింది. రాల్టన్ ఓవల్ పిచ్ ఎంత ప్రమాదకరంగా ఉందో క్రికెట్ ఆస్ట్రేలియా షేర్ చేసిన ఈ ఫుటేజీని చూస్తే అంచనా వేయవచ్చు. క్రికెట్ ఆస్ట్రేలియా షేర్ చేసిన ఈ వీడియోలో క్వీన్స్‌లాండ్ బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్ చేస్తున్న దృశ్యాన్ని చూడవచ్చు.

క్రీజులో మార్నస్ లాబుషాగ్నే బ్యాటింగ్‌ చేస్తున్నాడు. అతను దక్షిణ ఆస్ట్రేలియా బౌలర్ డేనియల్ వోరెల్ బంతులను ఎదుర్కొంటున్నాడు. ఒక బంతి వేగంగా వచ్చి లాబుస్చాగ్నే చేతికి తగలడంతో అతడు వెంటనే బ్యాట్‌ని వదిలేశాడు. మరొక బంతి అతని హెల్మెట్‌ను తాకినప్పుడు ప్రాణాలు పోయినంత పని అయింది. ఇదొక్కటే కాదు, బౌన్స్‌తో బ్యాట్స్‌మెన్ షాట్లు ఆడటానికి ఇబ్బంది పడుతున్నారు. ఎలాగోలా అవుట్ కాకుండా బతికిపోయాడు. వీడియో చూస్తే మీకు ఈ సంగతి అర్థమవుతుంది. తొలి రోజు ఆట రద్దయ్యే సమయానికి క్వీన్స్‌లాండ్ స్కోరు 1 వికెట్ నష్టానికి 87 పరుగులు. బ్రైస్ స్ట్రీట్ 45 పరుగులు, మార్నస్ లాబుస్‌చాగ్నే 21 పరుగులు చేశారు. ఇప్పుడు ఈ ఆట రెండో రోజు ఇక్కడి నుంచే ప్రారంభంకానుంది.

 

View this post on Instagram

 

A post shared by cricket.com.au (@cricketcomau)

చలికాలంలో గొంతు నొప్పి వస్తే చాలా జాగ్రత్త..! ఆ వ్యాధి లక్షణం కావొచ్చు.. ఆలస్యమైతే సర్జరీయే..?

India vs New Zealand: టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బ.. కాన్పూర్‌ టెస్ట్‌కి కీలక ఆటగాడు దూరం..

Airtel, Vodafone Idea లలో ఇప్పుడు ఎవరు బెస్ట్.. కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను పరిశీలించండి..

Click on your DTH Provider to Add TV9 Telugu