AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

268 స్ట్రైక్ రేట్‌తో బౌలర్ల భరతం పట్టాడు.. 19 బంతుల్లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.. అతడెవరో తెలుసా?

క్రికెట్‌లో తుఫాన్ ఇన్నింగ్స్‌ను మీరెప్పుడైనా చూశారా.? చూడకపోతే.! టామ్ కొల్లెర్ కాడ్మోర్ ఇన్నింగ్స్‌ చూస్తే చాలు ఖచ్చితంగా...

268 స్ట్రైక్ రేట్‌తో బౌలర్ల భరతం పట్టాడు.. 19 బంతుల్లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.. అతడెవరో తెలుసా?
Tom
Ravi Kiran
|

Updated on: Nov 23, 2021 | 4:58 PM

Share

క్రికెట్‌లో తుఫాన్ ఇన్నింగ్స్‌ను మీరెప్పుడైనా చూశారా.? చూడకపోతే.! టామ్ కొల్లెర్ కాడ్మోర్ ఇన్నింగ్స్‌ చూస్తే చాలు ఖచ్చితంగా థ్రిల్ అవుతారు. ఈ 27 ఏళ్ల బ్యాట్స్‌మెన్ కేవలం 19 బంతుల్లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. అబుదాబిలో జరుగుతున్న టీ10 లీగ్‌లో అతడు ఈ ఘనత సాధించాడు. ఈ నెల 22వ తేదీన షేక్ జాయెద్ స్టేడియం వేదికగా ఢిల్లీ బుల్స్, డెక్కన్ గ్లాడియేటర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో డెక్కన్ గ్లాడియేటర్స్‌ తరపున బ్యాటింగ్‌కు దిగిన టామ్ కొల్లెర్ కాడ్మోర్ విధ్వంసం సృష్టించాడు. తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగి ప్రత్యర్ధి బౌలర్ల భరతం పట్టాడు. అంతేకాకుండా టార్గెట్‌ను కేవలం 44 బంతుల్లో పూర్తి చేశాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ బుల్స్ నిర్ణీత 10 ఓవర్లలో 112 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టు ఓపెనర్ రోసో 21 బంతుల్లో 48 పరుగులు చేశాడు. అలాగే రూథర్‌ఫోర్డ్ 316 స్ట్రైక్ రేట్‌తో 6 బంతుల్లో 19 పరుగుల చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించడంలో సహాయపడ్డాడు. ఇక డెక్కన్ గ్లాడియేటర్స్‌ బౌలర్లలో ఆండ్రీ రస్సెల్ 3 వికెట్లు పడగొట్టగా.. టిమల్‌ మిల్స్‌, హసరంగ రెండేసి వికెట్లు తీశారు.

19 బంతుల్లో 51 పరుగులు…

ఢిల్లీ బుల్స్ విధించిన 112 పరుగుల టార్గెట్‌ను చేధించే క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన డెక్కన్ గ్లాడియేటర్స్‌కు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు టామ్ కోలెర్(51), టామ్ బంటన్(44)లు మొదటి వికెట్‌కు 100 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలోనే డెక్కన్ గ్లాడియేటర్స్ కేవలం 7.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఈ టార్గెట్ చేజ్‌లో టామ్ కోలెర్ కాడ్మోర్ తుఫాన్ ఇన్నింగ్స్ ఎంతగానో సహాయపడింది. అతడు కేవలం 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 51 పరుగుల చేసి అజేయంగా నిలిచాడు. అటు టామ్ బంటన్ 21 బంతుల్లో 44 పరుగులు చేశాడు.

సరిగ్గా నేటికి 46 ఏళ్లు..పాక్ కు చుక్కలు చూపించిన భారత దిగ్గజాలు
సరిగ్గా నేటికి 46 ఏళ్లు..పాక్ కు చుక్కలు చూపించిన భారత దిగ్గజాలు
'ఇకపై బడి పిల్లలు షూ బదులు చెప్పులు ధరించాలి'.. ప్రభుత్వం ప్రకటన
'ఇకపై బడి పిల్లలు షూ బదులు చెప్పులు ధరించాలి'.. ప్రభుత్వం ప్రకటన
ముంబైలో కాలి బూడిదైన జగిత్యాల బస్సు!
ముంబైలో కాలి బూడిదైన జగిత్యాల బస్సు!
దారులన్నీ మేడారం వైపే.. అలా చేస్తే ఇట్టే పసిగడతారు..
దారులన్నీ మేడారం వైపే.. అలా చేస్తే ఇట్టే పసిగడతారు..
హార్దిక్ మెసేజ్‎కు ఆర్సీబీ స్టార్ ప్లేయర్ కళ్లలో ఆనంద బాష్పాలు
హార్దిక్ మెసేజ్‎కు ఆర్సీబీ స్టార్ ప్లేయర్ కళ్లలో ఆనంద బాష్పాలు
ఆదివారం సెలవు రద్దు.. ఆ రోజు తెరిచే ఉంటుంది? కీలక నిర్ణయం..!
ఆదివారం సెలవు రద్దు.. ఆ రోజు తెరిచే ఉంటుంది? కీలక నిర్ణయం..!
ఖర్చు లేని మ్యాజిక్.. బియ్యం నీటితో ఇన్ని ప్రయోజనాలా...?
ఖర్చు లేని మ్యాజిక్.. బియ్యం నీటితో ఇన్ని ప్రయోజనాలా...?
అడ్వాన్స్‌డ్ క్వాంటం స్కిల్లింగ్ కోర్సుకు ఊహించని స్పందన
అడ్వాన్స్‌డ్ క్వాంటం స్కిల్లింగ్ కోర్సుకు ఊహించని స్పందన
నువ్వేకావాలి ఫస్ట్ మహేష్‌తో తీద్దామనుకున్నాం.. కానీ అసలు జరిగింది
నువ్వేకావాలి ఫస్ట్ మహేష్‌తో తీద్దామనుకున్నాం.. కానీ అసలు జరిగింది
నాపై ఆ ముద్ర వేశారు.. డైరెక్టర్ వేణు యెల్దండి..
నాపై ఆ ముద్ర వేశారు.. డైరెక్టర్ వేణు యెల్దండి..