AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Biryani Free Offer: భోజన ప్రియులకు బంపర్ ఆఫర్.. కేజీ టమాటో ఇస్తే కేజీ బిర్యానీ ఫ్రీ.. ఇదెక్కడో తెలుసా..!

భోజన ప్రియులకు శుభవార్త.. పసందైన - రుచికరమైన వంటకాన్ని ఫ్రీ ఇస్తానంటూ ప్రకటించింది ఓ బిర్యానీ సెంటర్..

Biryani Free Offer: భోజన ప్రియులకు బంపర్ ఆఫర్.. కేజీ టమాటో ఇస్తే కేజీ బిర్యానీ ఫ్రీ.. ఇదెక్కడో తెలుసా..!
Biryani Tomato Free
Balaraju Goud
|

Updated on: Nov 23, 2021 | 8:59 PM

Share

Biryani Free Offer: భోజన ప్రియులకు శుభవార్త.. పసందైన – రుచికరమైన వంటకాన్ని ఫ్రీ ఇస్తానంటూ ప్రకటించింది ఓ బిర్యానీ సెంటర్.. అయితే, ఓ కండిషన్ పెట్టింది. బిర్యానీ కోసం వచ్చే వారు కిలో టమాటోలు వెంట తీసుకువచ్చి ఇవ్వాలంటూ షరతు పెట్టింది. లేదంటే బిర్యానీ కొంటే టమాటోలు ఫ్రీ ఇస్తానని ప్రకటించింది. దీంతో భోజన ప్రియులు ఎగబడి మరీ కొంటుండటంతో బిర్యానీ సెంటర్‌కు భారీగా గిరాకీ పెరిగింది. పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. ఇక, పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చెన్నై శివార్లలో ఉన్న అంబూర్ బిర్యానీ సెంటర్ నిర్వహకులు ఇచ్చిన స్పెషల్ ఆఫర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రేండింగ్ మారింది.

అసలు ఎందుకిలా అంటే.. చెన్నైలో కేజీ టమాటో ధర రూ.150కి పైగా పలుకుతోంది. ఈ నేపధ్యంలో చెంగల్పట్టు జిల్లాలోని మధురాంతకం ప్రాపర్టీలోlr అంబూర్ బిర్యానీ షాప్ యజమాని తన సేల్స్ పెంచుకోవడం కోసం ఒక కొత్త ఆఫర్ కస్టమర్లకు ప్రకటిచారు. దీంతో బిర్యానీ కోసం భోజన ప్రియులు ఎగబడుతున్నారు. ఇంతకీ ఏం ఆఫర్ చేశాడంటే.. అంబూర్ బిర్యానీ షాప్‌లో ఒక కేజీ బిర్యానీ వంద రూపాయిలు, ఎవరైనా రెండు కేజీల బిర్యానీ కొంటే వారికి అరకిలో టమాటాలు ఫ్రీగా ఇస్తామని ఆఫర్ చేశారు. లేదంటే, ఒక కేజీ టమాటోలు తీసుకుని వచ్చి ఇస్తే.. ఒక కేజీ బిర్యానీ ఫ్రీగా ఇస్తామని ఆఫర్ ఇవ్వడంతో జనం తండోపతండాలు వస్తున్నారు. దీంతో గిరాకీ పెరిగింది. తను అనుకున్నది సక్సెస్ అవ్వడంతో షాపు యాజమాని తెగ మురిసిపోతున్నాడు. అయితే, టమాటా ధర పతనంపై అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకే మంగళవారం ఫ్రీ సేల్‌ నిర్వహించినట్లు దుకాణం యజమాని తెలిపారు.

Chennai Biryani Tomato Free

Chennai Biryani Tomato Free

కాగా, టమాటా కోసమే బిర్యానీ కొంటున్న జనానికి సంబంధించిన వీడియో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, టమాటో ధర గురించి ట్రేండింగ్ అవడంతో ఈ వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది.

Read Also…. Telangana: ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వండి.. కేంద్ర మంత్రి పీయూష్‌ను కోరిన కేటీఆర్‌ బృందం..