Wine Shop Attack: మద్యం షాపులోకి దూసుకెళ్లిన మహిళలు.. తమ సమస్యను తామే పరిస్కారం.. వైరల్‎గా మారిన వీడియో..

మద్యం అమ్మకాలు ఆపాలంటూ వారు పోరాటం చేస్తున్నారు. అయినా అమ్మకాలు కొనసాగించడంతో వారంతా సహనం కోల్పోయారు. మద్యం షాపుపై దాడి చేశారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. మహిళలంతా మద్యం షాపులోకి చొరబడి ఫర్నీచర్‌ను ధ్వంసం చేసిన వీడియోలు....

మద్యం అమ్మకాలు ఆపాలంటూ వారు పోరాటం చేస్తున్నారు. అయినా అమ్మకాలు కొనసాగించడంతో వారంతా సహనం కోల్పోయారు. మద్యం షాపుపై దాడి చేశారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. మహిళలంతా మద్యం షాపులోకి చొరబడి ఫర్నీచర్‌ను ధ్వంసం చేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కర్ణాటకలోని చిక్‌మంగళూరు జిల్లా ముస్లాపుర గ్రామంలో మహిళలు మద్యం దుకాణంపై దాడి చేశారు. గ్రామంలో గతంలో రెండు సార్లు మద్యం షాపు తెరవడాన్ని మహిళలు వ్యతిరేకించారు. మహిళలు చెబుతున్నా లెక్కచేయకుండా మద్యం దుకాణాన్ని తెరిచారు. దీంతో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన మహిళలంతా కలిసి స్థానికుల సహకారంతో మద్యం దుకాణాన్ని మూసివేయాలని నిర్ణయించారు.

మహిళలు మొదట మద్యం దుకాణం వద్ద ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న వ్యక్తులను ప్రశ్నించగా మద్యం షాపును మూసివేయడానికి అంగీకరించలేదు. దీంతో మహిళలు లోపలికి దూసుకెళ్లారు. మద్యం దుకాణంలోని టేబుల్‌లు, కుర్చీలు ధ్వంసం చేశారు. మహిళలు లోపలికి వెళ్లేలోపు మద్యం బాటిళ్లను తరలించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బార్ తెరవడానికి అనుమతిస్తే తమ భర్తలు తమకు ఏమీ లేకుండా మద్యానికి ఖర్చు చేస్తారని మహిళలు వాపోతున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Icon Star Allu Arjun Pushpa: సోషల్ మీడియాలో పుష్పరాజ్ సందడి.. ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ పుష్ప లుక్స్..

jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..

Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Click on your DTH Provider to Add TV9 Telugu