ఆ బాడీ పార్ట్‌ కోసం 13 కోట్లు.. నటి నిర్వాకం..! ఓ రేంజ్ లో వైరల్ అవుతున్న మేటర్..(వీడియో)

ఆ బాడీ పార్ట్‌ కోసం 13 కోట్లు.. నటి నిర్వాకం..! ఓ రేంజ్ లో వైరల్ అవుతున్న మేటర్..(వీడియో)

Anil kumar poka

|

Updated on: Nov 24, 2021 | 8:51 AM

మనిషి తన జీవితానికే కాదు.. విలువైన వస్తువులు కారులు, బైక్స్ వంటి వస్తువులకు కూడా ఇన్సురెన్స్ చేయించుకుంటారని అందరికీ తెలిసిన సంగతే.. అయితే దీనికి భిన్నంగా గత కొంతకాలంగా కొంతమంది సెలబ్రెటీలు తమ శరీరంలోని అయవాలైన ముక్కు, చెవి, పెద‌వులు, కాళ్లు, చేతులను


మనిషి తన జీవితానికే కాదు.. విలువైన వస్తువులు కారులు, బైక్స్ వంటి వస్తువులకు కూడా ఇన్సురెన్స్ చేయించుకుంటారని అందరికీ తెలిసిన సంగతే.. అయితే దీనికి భిన్నంగా గత కొంతకాలంగా కొంతమంది సెలబ్రెటీలు తమ శరీరంలోని అయవాలైన ముక్కు, చెవి, పెద‌వులు, కాళ్లు, చేతులను కూడా ఇన్సురెన్స్ చేయించుకుంటున్నారు. కాని తాజాగా బ్రెజిల్ కు చెందిన మోడల్ తన పిరుదులను ఏకంగా రూ 13 కోట్లకు ఇన్సూరెన్స్‌ చేయించి వరల్డ్ వైడ్‌గా హాట్ టాపిక్ గా మారింది.

బ్రెజిల్‌కు చెందిన ఫేమస్ మోడ‌ల్ నాథీ కిహారా. మోడలింగ్‌లో రాణించడంతో పాటు ఈ ఏడాది ‘బుమ్‌బుమ్ 2021 వ‌ర‌ల్డ్ టైటిల్‌ను కూడా గెలుచుకున్న ఈ బ్యూటీ తాజాగా నెట్టింట వైరల్‌ గా మారింది. తన శరీరంలోని బ్యాక్‌ పార్టే తనకు మోడలింగ్లో రాణించేలా.. టైటిల్‌ సాధించేలా చేసింది కాబట్టే ఇన్సూరెన్స్‌ చేయాలనే నిర్ణయం తీసుకుంది.కిహారాకు పెళ్లి అయ్యింది. ఇద్దరు పిల్లల తల్లి. మొదట తొమ్మిదేళ్ల బాలుడు. గత కొన్ని నెలల క్రితం రెండో బిడ్డకు జన్మనిచ్చింది. అయినప్పటికీ కిహారా నాథీ మోడ‌ల్‌గా రాణిస్తుంది. ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ మిస్ బుమ్‌బుమ్ టైటిల్‌ను గెలుచుకుంది. “ప్రపంచవ్యాప్తంగా ఆత్మగౌరవ సమస్యలతో బాధపడుతున్న చాలా మంది తల్లులకు ప్రాతినిధ్యం వహించడం.. వారిని ప్రోత్సహించడం తనకు దక్కిన గౌరవంఅని చెప్పింది. “నా బట్ పూర్తిగా సహజమైనది. నా శరీరాన్ని కాపాడుకోవడానికి నేను చాలా శిక్షణ తీసుకుంటానని చెప్పి అందర్నీ ఆకట్టుకుంది.