Tollywood: 40 గ్రాముల ప్రోటీన్ బ్రేక్‌ఫాస్ట్.. స్టార్ హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్ బయటపెట్టిన ట్రైనర్!
పాన్-ఇండియా లెవెల్‌లో బిజీగా ఉండే టాప్ హీరోయిన్, రోజుకు 12-14 గంటలు షూటింగ్, డాన్స్ రిహార్సల్స్, ఈవెంట్స్ మధ్యలో కూడా ఆమె బాడీ ఎప్పుడూ టోన్డ్‌గా, ఎనర్జీ నిండా ఉంటుంది. ఆమె ఫ్లాట్ బెల్లీ, గ్లోయింగ్ స్కిన్ చూసి లక్షల మంది యంగ్ గర్ల్స్ ఫాలో ..

పాన్-ఇండియా లెవెల్‌లో బిజీగా ఉండే టాప్ హీరోయిన్, రోజుకు 12-14 గంటలు షూటింగ్, డాన్స్ రిహార్సల్స్, ఈవెంట్స్ మధ్యలో కూడా ఆమె బాడీ ఎప్పుడూ టోన్డ్‌గా, ఎనర్జీ నిండా ఉంటుంది. ఆమె ఫ్లాట్ బెల్లీ, గ్లోయింగ్ స్కిన్ చూసి లక్షల మంది యంగ్ గర్ల్స్ ఫాలో అవుతున్నారు. ఇంత బిజీ షెడ్యూల్‌లో ఆమె ఎలా ఇంత పర్ఫెక్ట్ ఫిట్‌నెస్ మెయింటైన్ చేస్తోంది? ఆ సీక్రెట్ ఇప్పుడు ఆమె పర్సనల్ ఫిట్‌నెస్ ట్రైనర్ బయటపెట్టేశాడు! ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఆమె ఫాలో అవుతున్న సీక్రెట్ ఏంటి?
ఆ పర్సనల్ ట్రైనర్ రివీల్ చేసిన బ్రేక్‌ఫాస్ట్ రెసిపీలో ఒక్కసారి 40 గ్రాముల ప్రోటీన్ ఉంటుందట! ఇది సాధారణ ఓట్స్, బ్రౌన్ బ్రెడ్ కాదు, ఇండియన్ కిచెన్‌లో ఎప్పుడూ దొరికే సాధారణ పదార్థాలతోనే తయారవుతుంది. రోజూ ఉదయం ఈ ఒక్క భోజనం తింటే చాలు, మసిల్స్ గ్రోత్, ఎనర్జీ లెవెల్స్, స్కిన్ గ్లో మూడూ ఒకేసారి పెరుగుతాయని ట్రైనర్ గ్యారంటీ ఇస్తున్నాడు. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరు? అని ఆలోచిస్తున్నారు. ఆమె ఎవరో కాదు, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా! ఆమె పర్సనల్ ట్రైనర్ రోహిత్ నాయర్ ఈ హై-ప్రోటీన్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని బయటపెట్టాడు.

Tamannaahh
ఎలా చేస్తారు..
రోజూ ఉదయం తమన్నా తినే ఈ స్పెషల్ డిష్‌లో ఏం ఉంటుందంటే.. 4 ఎగ్ వైట్స్ (లేదా 2 ఫుల్ ఎగ్స్ + 2 వైట్స్), 50 గ్రాముల పనీర్ (క్రంబుల్ చేసి), ఒక కప్ ఓట్స్ లేదా మూంగ్ దాల్ చీలా మిక్స్, ఒక టేబుల్ స్పూన్ గ్రౌండ్ ఫ్లాక్స్ సీడ్స్, ఒక టమాట, ఉల్లిపాయ, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ (చాప్డ్), ఉప్పు, మిరియాలు, జీలకర్ర పొడి. ఈ మిక్స్‌ని ఓమ్లెట్ లాగా లేదా చీలా లాగా చేసుకుంటే… ఒక్కసారి 38-42 గ్రాముల ప్రోటీన్ సులభంగా శరీరానికి అందుతుంది.
View this post on Instagram
తమన్నా దీనితో పాటు ఒక గ్లాస్ బ్లాక్ కాఫీ లేదా గ్రీన్ టీ తాగుతుందట. ఈ బ్రేక్‌ఫాస్ట్ వల్ల ఆమె రోజంతా హై ఎనర్జీతో ఉంటుందని ట్రైనర్ చెప్పాడు. ప్రస్తుతం తమన్నా టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, ఐటెమ్ సాంగ్స్‌తో బిజీబిజీగా ఉంది. ఈ బిజీ షెడ్యూల్‌లోనూ ఆమె ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదేనంటున్నాడు ట్రైనర్. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి… తమన్నా లాంటి గ్లోయింగ్ ఫిట్‌నెస్ పొందండి.




