AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mutton Keema Recipe: అబ్బా ఏముంది మావా.. మటన్ ఖీమా ఇలా వండితే రుచి అదిరిపోవాల్సిందే!

నాన్‌వెజ్‌ అంటే ప్రతి ఒక్కరికి నోరూరుతుంది.. ఇక మటన్ గురించి అయితే ప్రత్యేకరంగా చెప్పకర్లేటు.. సండే వస్తే కొందరికి మటన్ లేనిది ముద్దదిగదు.. మటన్ ప్రియులకు మరో ఫేవరెట్‌ డిష్‌ మటన్ ఖీమా.. మటన్ కీమాతో రకరకాల వంటకాలను మనం చేసుకోవచ్చు. అయితే మనం ఇప్పుడు ఇంట్లోనే టేస్టీ టేస్టీగా.. మటన్ ఖీమా కర్రీ చేసుకోవచ్చు.. ఇది పులావ్, చికెన్, పూరీ, చపాతీ, అన్నం ఇలా వేటితో తిన్నా ఆ రుచికి మనం మంత్రముగ్దులు అవ్వాల్సిందే.. కాబట్టి ఆ టేస్టీ మటన్ కీమా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.

Mutton Keema Recipe: అబ్బా ఏముంది మావా.. మటన్ ఖీమా ఇలా వండితే రుచి అదిరిపోవాల్సిందే!
Mutton Keema Recipe
Anand T
|

Updated on: Nov 22, 2025 | 12:25 PM

Share

నాన్‌వెజ్‌ ప్రియులలో కూడా రకరకాల వ్యక్తులు ఉంటారు. నాన్‌వెజ్‌లో కొందరికి చికెన్ ఇస్టముంటే, మరికొందరికి మటన్ ఇష్టపడుతారు. ఇందులో కూడా మటన్ కీమాను ఇష్టపడేవారు కూడా సపరేట్‌గా ఉంటారు. ఈ మటన్ కీమాతో ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చు. స్నాక్స్, బిర్యానీ, కర్రీస్ ఇలా చాలా రకాల వెరైటీలు చేసుకోవచ్చు. ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్. అయితే సాధారణంగా చేసుకునే మటన్ ఖీమాకి బదులు.. ఇప్పుడు మేం చెప్పబోయే విధంగా వండుకుంటే.. దాని టేస్ట్‌ను మీరు మరింత ఆస్వాధించవచ్చు. కాబట్టి ఈ స్పెషల్ మటన్ ఖీమా కర్రీని ఎలా తయారు చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి? అనేవి ఇప్పుడు తెలుసుకుందాం.

మటన్ ఖీమా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు

మటన్ ఖీమా, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, యాలకులు, దాల్చిన చెక్క, కరివేపాకు, పుదీనా, ఆయిల్, బిర్యానీ ఆకు, లవంగాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా.

మటన్ ఖీమా కర్రీ ఎలా తయారు చేసుకోవాలి

మీరు మటన్ కీమాను తయారు చేసుకునేందుకు మీరు ముందుగా కుక్కర్ తీసుకుని అందులో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్‌లో మసాలా దినుసులు వేసుకుని వాటిని దోరగా వేగేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసి వేగా.. ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి వేసుకుని కలపాలి కొద్ది సేపు వేయించాలి. ఇవి ఎర్రగా వేగిన తర్వాత పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి కలపాలి. ఇలా ఖీమాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా అంటేలా చూసుకొని.. ఓ ఐదు నిమిషాల పాటు వేయించిన తర్వాత.. కారం, ఉప్పు, ధనియాల పొడి యాడ్ చేయాలి. ఇవన్ని వేసిన తర్వాత కాసేపు వేయించి నీళ్లు పోసి మూత పెట్టి కాసేపు ఉడికించాలి.

కర్రీ మొత్తగా ఉడికాక అందులో కాస్తా గరం మసాలా, పుదీనా, కొత్తి మీర వేసి ఒకసారి కలుపుకోవాలి, ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టి.. ఓ ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ ప్రెజర్ తగ్గిపోయాక మొల్లగా మూత తీసి చూసుకోవాలి. నీళ్లు ఉంటే కాసేపు మళ్లీ కాసేపు ఉడికించి దించేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే.. మటన్ ఖీమా రెడీ అవుతుంది. ఇలా మీరు ఒక్కసారి ట్రై చేస్తే.. మళ్లీ ఇదే స్టైల్ లో వండుకుంటారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.