AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Health: బాబోయ్ ఎండలు.. ఆరోగ్యంగా ఉండాలంటే ఫ్రూట్ సలాడ్ తప్పనిసరిగా తినండి..

ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ క్రమంలో ఎండాకాలంలో మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే వేసవిలో శరీరం చాలా త్వరగా అలసిపోతుంది.

Summer Health: బాబోయ్ ఎండలు.. ఆరోగ్యంగా ఉండాలంటే ఫ్రూట్ సలాడ్ తప్పనిసరిగా తినండి..
Summer Health Tips
Shaik Madar Saheb
|

Updated on: Apr 20, 2023 | 9:38 AM

Share

ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ క్రమంలో ఎండాకాలంలో మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే వేసవిలో శరీరం చాలా త్వరగా అలసిపోతుంది. అదే సమయంలో, వేడి కారణంగా ఏమీ తినాలని అనిపించదు. బలహీనత పెరుగుతుంది. ఈ సీజన్‌లో శరీరంలో పోషకాల లోపం ఏర్పడుతుందని, దాని వల్ల రోగనిరోధక శక్తి కూడా బలహీనపడుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే మీ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇలాంటి పరిస్థితుల్లో మీరు కూడా వేసవి కాలంలో మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే.. మీ ఆహారంలో ఫ్రూట్ సలాడ్‌ను చేర్చుకోవాలి. ఫ్రూట్ సలాడ్ తీసుకోవడం వల్ల శరీరానికి అనేక వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది. వేసవి కాలంలో ఎలాంటి ఫ్రూట్ సలాడ్ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి..

వేసవి కాలంలో ఈ ఫ్రూట్ సలాడ్లను తీసుకోండి..

మిక్స్ ఫ్రూట్ సలాడ్: మిక్స్ ఫ్రూట్ సలాడ్ సమ్మర్ సీజన్ లో తప్పనిసరిగా తినాలి. ఈ సలాడ్ చేయడానికి సీజనల్ ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి ఒక గిన్నెలో వేయండి. దీని కోసం మీరు పైనాపిల్, కివి, బొప్పాయి, పుచ్చకాయ, ద్రాక్ష, యాపిల్, మామిడి ఇలా అన్ని రకాల పండ్లు ఉపయోగించవచ్చు. ఈ సలాడ్ తినడం వల్ల మీరు అనేక రకాల సమస్యల నుండి బయటపడతారు.

ఇవి కూడా చదవండి

సమ్మర్ సీజన్‌లో ఫ్రూట్ సలాడ్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..

  • వేసవి కాలంలో ఫ్రూట్ సలాడ్ తినడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. పొట్ట కూడా నిండుగా ఉంటుంది.
  • మీరు బరువు తగ్గాలనుకుంటే ఫ్రూట్ సలాడ్ తినండి. ఫ్రూట్ సలాడ్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఉండవు. బరువు కూడా తగ్గవచ్చు.
  • ఫ్రూట్ సలాడ్‌లో పుచ్చకాయ, కీరదోస, కర్బూజ లాంటి వాటిని చేర్చుకోండి. శరీరం విటమిన్-ఎ, విటమిన్-సి లక్షణాలను పొందుతుంది.
  • కివి, లిచీ తినడం ద్వారా శరీరం యాంటీఆక్సిడెంట్లు, ఫోలేట్, పొటాషియం మొదలైన లక్షణాలను పొందుతుంది.
  • ద్రాక్ష స్ట్రాబెర్రీ వంటి పండ్లను తీసుకోవడం ద్వారా, శరీరం విటమిన్-సి పొటాషియం, రిబోఫ్లేవిన్ వంటి పోషకాల ప్రయోజనాలను పొందుతుంది.
  • ఈ పండ్లతో ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..

Follow Us
నాన్ వెజ్ తినేవారికి షాక్.. పెరిగిన చికెన్ ధరలు.. ఎంతో తెలుసా..?
నాన్ వెజ్ తినేవారికి షాక్.. పెరిగిన చికెన్ ధరలు.. ఎంతో తెలుసా..?
దుబాయ్‌లో చిక్కుకున్న మంచు విష్ణు ఫ్యామిలీ, పివీ సింధు..
దుబాయ్‌లో చిక్కుకున్న మంచు విష్ణు ఫ్యామిలీ, పివీ సింధు..
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
ఈ ఫోటోలో ఉన్న చేపను కనిపెడితే మిమ్మల్ని మించిన తోపులు లేరు!
ఈ ఫోటోలో ఉన్న చేపను కనిపెడితే మిమ్మల్ని మించిన తోపులు లేరు!
చిన్న బ్రాయిలర్ vs పెద్ద బ్రాయిలర్.. ఏ చికెన్ మంచిది..?
చిన్న బ్రాయిలర్ vs పెద్ద బ్రాయిలర్.. ఏ చికెన్ మంచిది..?
విండీస్ కోటను బద్ధలు కొట్టేందుకు సూర్య సేన రెడీ
విండీస్ కోటను బద్ధలు కొట్టేందుకు సూర్య సేన రెడీ
36 ఏళ్లపాటు సుల్తాన్‌గా.. మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్..
36 ఏళ్లపాటు సుల్తాన్‌గా.. మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్..
నాపై చర్యలు తీసుకుంటారంట.. ఆల్రెడీ సగం జీవితం పోయింది.. గీతూ
నాపై చర్యలు తీసుకుంటారంట.. ఆల్రెడీ సగం జీవితం పోయింది.. గీతూ
ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటున్నారా..? యాప్ బంద్
ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటున్నారా..? యాప్ బంద్
గల్ఫ్ దేశాల్లో క్షిపణుల మోత.. ప్లేయర్ల ఇంటి ప్రయాణంపై నీలినీడలు
గల్ఫ్ దేశాల్లో క్షిపణుల మోత.. ప్లేయర్ల ఇంటి ప్రయాణంపై నీలినీడలు