Eye Care : వేసవిలో కంటి సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయా? అయితే ఈ సింపుల్ చిట్కాలతో ఉపశమనం పొందండి
మ్మర్‌లో మన శరీరం లాగే మన కళ్లు కూడా చాలా ఒత్తిడికి గురవుతాయి. తీవ్రమైన వేడి కారణంగా కంటిశుక్లం, మాక్యులర్ డీజెనరేషన్, కల్లు పొడిబారడం తదితర సమస్యలు తలెత్తుతాయి. ఇక కొంతమందికి సీజన్‌లో నిరంతరం కంటి చికాకు ఉంటుంది.
నిమ్మరసంతో మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. శరీరాన్ని డీహైట్రేటెడ్‌గా ఉంచడంతో పాటు బాడీలోని మలినాలను బయటకు పంపించడంలో నిమ్మరసంలోని పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇక నిమ్మరసంలో నల్ల ఉప్పు, చక్కెర లాంటి స్వీటెనర్లు మిక్స్ చేసి తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇక వేసవికాలంలో నిమ్మరసంతో పలు లాభాలున్నాయి. ముఖ్యంగా సమ్మర్ సీజన్‌లో కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో నిమ్మరసం కీరోల్ పోషిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. సమ్మర్‌లో మన శరీరం లాగే మన కళ్లు కూడా చాలా ఒత్తిడికి గురవుతాయి. తీవ్రమైన వేడి కారణంగా కంటిశుక్లం, మాక్యులర్ డీజెనరేషన్, కల్లు పొడిబారడం తదితర సమస్యలు తలెత్తుతాయి. ఇక కొంతమందికి సీజన్‌లో నిరంతరం కంటి చికాకు ఉంటుంది. దీనికి ప్రధాన కారణం గాలిలోని కాలుష్య కారకాలు.. ఇవి ఎక్కువగా ఉండటం వల్ల మన కళ్లు అలర్జీకి గురవుతాయి. అందుకే, వేసవిలో మన కళ్లను సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మంచి నాణ్యమైన సన్ గ్లాసెస్ ధరించడం వల్ల కళ్లకు రక్షణ కలుగుతుంది. అయితే ఇది కంటి సమస్యలకు తాత్కాలిక పరిష్కారం మాత్రమే. దీంతో పాటు ఆరోగ్యకరమైన, పోషకమైన ఆహారాలతో మీ కంటి ఆరోగ్యాన్ని పోషించడం కూడా అంతే ముఖ్యం. ఈక్రమంలో నిమ్మకాయ రసం గొప్పగా పనిచేస్తుంది.
నిమ్మరసంతో కంటికి ఎలా మేలంటే?
విటమిన్ సి:
నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఇందులోని లక్షణాలు ఒత్తిడి నుండి కళ్ళను రక్షించడంలో సహాయపడుతాయి.
విటమిన్ ఎ:
నిమ్మకాయలో విటమిన్ ఎ కూడా ఉంటుంది . ముఖ్యంగా దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడే ముఖ్యమైన పోషకం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, శరీరంలో విటమిన్ ఎ లోపం పాక్షిక అంధత్వానికి దారి తీస్తుంది.
లుటీన్
నిమ్మరసంలో రెండు ముఖ్యమైన పోషకాలు ఎక్కువగా ఉన్నాయి . అవి లుటిన్, జియాక్సంతిన్ . ఇవి మాక్యులర్ డిజెనరేషన్, కంటిశుక్లం నుండి కళ్ళను రక్షించడంలో సహాయపడతాయి.
రక్త నాళాలను బలోపేతం చేయడానికి
నిమ్మకాయలోని విటమిన్ సి కళ్లలోని రక్తనాళాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇది రెటీనాకు రక్త ప్రవాహాన్ని మరింత ప్రేరేపిస్తుంది. అలాగే దృష్టితో పాటు మొత్తం కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..