AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sugarcane Juice: చెరకు రసంతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. ఈ సమస్యలకూ చెక్‌ పెట్టొచ్చు

చెరకు పాలలో గ్లూకోజ్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి మరింత శక్తి లభిస్తుంది. అలాగే మూత్ర సంబంధిత రోగాలను నయం చేసే చికిత్సా పద్ధతుల్లో దీనిని ఎక్కువగా వాడతారు.

Sugarcane Juice: చెరకు రసంతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. ఈ సమస్యలకూ చెక్‌ పెట్టొచ్చు
Sugarcane Juice
Basha Shek
|

Updated on: Oct 30, 2022 | 10:47 AM

Share

చెరకు రసం రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే ఆరోగ్య నిపుణులు కూడా ఈ జ్యూస్‌ని తరచూ తీసుకోవాలని సూచిస్తుంటారు. ముఖ్యంగా కామెర్లు వచ్చినప్పుడు చెరుకు రసం తాగడం మంచిదంటారు. ఇతర పండ్లు, కూరగాయలతో పోల్చితే చెరకు పాలలో నీటి స్థాయులు ఎక్కువగా ఉంటాయి. అలాగే పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇక చెరకు పాలలో గ్లూకోజ్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి మరింత శక్తి లభిస్తుంది. అలాగే మూత్ర సంబంధిత రోగాలను నయం చేసే చికిత్సా పద్ధతుల్లో ఈ పాలను ఎక్కువగా వాడతారు. అధ్యయనాలు, పరిశోధనల్లో కూడా చెరకు రసం ప్రయోజనాలను విస్తృతంగా చర్చించారు. మరి అవేంటో తెలుసుకుందాం రండి. యునాని వైద్య విధానం ప్రకారం, చెరకు రసం కామెర్లు రోగులకు మంచిదని భావిస్తారు. చెరకులో వివిధ బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. అదేవిధంగా చెరకు అనాల్జేసిక్, యాంటీహైపెర్గ్లైసీమిక్, హెపాటోప్రొటెక్టివ్ ప్రభావాలను కలిగి ఉంటుంది. చెరకు రసంలో అపిజెనిన్, ట్రైసిన్, ఓరియంటిన్, వైటెక్సిన్, స్కాఫ్టోసైడ్, స్వర్టిసిన్ వంటి లుటియోలిన్ గ్లైకోసైడ్‌లు కూడా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

మూత్ర పిండాల సమస్యలకు చెక్‌..

చెరకు రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మూత్ర సమస్యలు దూరమవుతాయి. ముఖ్యంగా కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది. చెరుకు రసంలో నిమ్మరసం, అల్లం రసం కలిపి తాగితే అదనపు రుచితో పాటు మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. ఇక కాలేయం ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. అందుకే వైద్యులు సాధారణంగా కామెర్లు ఉన్నవారికి చెరుకు రసం తాగమని సలహా ఇస్తారు. ఇక చెరకు రసాన్ని రోజూ సేవించవచ్చు. ఒక గ్లాసు చెరుకు రసం ఎప్పుడైనా తీసుకోవచ్చు. అయితే మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే, మీరు వైద్యుడిని సంప్రదించిన తర్వాతే ఈ డ్రింక్‌ను తీసుకోవాలి. ఇక చెరకు రసంలో కరిగే ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి, ఇది ప్రేగుల ద్వారా ఆహారాన్ని సులభతరం చేయడానికి సహాయపడుతుంది. అలాగే మలబద్ధకం, కడుపు ఉబ్బరం సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

శరీరంలో తగినన్నీ యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటే, రోగనిరోధక వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. చెరకు పాలలో ఇవి సమృద్ధిగా లభిస్తాయి. అందువల్ల దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చెరకు పాలలో మంచి మొత్తంలో ఉండే గ్లైకోలిక్ యాసిడ్ వంటి ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు రేడియేషన్‌కు గురైన చర్మాన్ని పునరుత్పత్తి చేయడంలో సహాయపడతాయి. ఇది ముఖంలోని మొటిమలు, మచ్చలను కూడా తగ్గిస్తాయి. చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంతో పాటు మృదువుగా మారుస్తుంది.

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం  క్లిక్ చేయండి