AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

High BP: హైబీపీతో బాధపడే వారికి పిస్తా పప్పులు అద్భుత వరం.. మరెన్నో ప్రయోజనాలు మీ సొంతం..

అధిక బరువు, మధుమేహం, హై బీపీ ప్రస్తుత ఆధునిక కాలంలో వేధిస్తున్న అతి ముఖ్యమైన అనారోగ్య సమస్యలు. జీవనశైలి, ఆహార అలవాట్లలో మార్పుల కారణంగా చాలా మంది వివిధ రకాల సమస్యలతో సతమతమవుతున్నారు...

High BP: హైబీపీతో బాధపడే వారికి పిస్తా పప్పులు అద్భుత వరం.. మరెన్నో ప్రయోజనాలు మీ సొంతం..
Pistachio
Ganesh Mudavath
|

Updated on: Oct 30, 2022 | 10:20 AM

Share

అధిక బరువు, మధుమేహం, హై బీపీ ప్రస్తుత ఆధునిక కాలంలో వేధిస్తున్న అతి ముఖ్యమైన అనారోగ్య సమస్యలు. జీవనశైలి, ఆహార అలవాట్లలో మార్పుల కారణంగా చాలా మంది వివిధ రకాల సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 1.28 బిలియన్లకు పైగా ప్రజలు అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారు. 1 బిలియన్ కంటే ఎక్కువ మంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. 422 మిలియన్ల మంది మధుమేహ బాధితులు ఉన్నారు. అందువల్ల ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి సమతుల ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ప్రతి రోజూ ఏదో ఒక రకమైన శారీరక శ్రమను పాటించడం చాలా ముఖ్యం. ఫిట్‌గా ఉండటానికి వ్యాయామం చేయడం ముఖ్యమనే విషయాన్ని విస్మరించకూడదు. అంతే కాకుండా మనం తినే ఆహారంపై దృష్టి సారించాలి. ఎంత తింటున్నామనే అంశంపై కాకుండా ఏం తింటున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అటువంటి సూపర్ ఫుడ్ లో పిస్తా ఒకటి. అధిక రక్తపోటును తగ్గించడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో పిస్తా పప్పులు అద్భుతంగా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఊబకాయం, మధుమేహం, రక్తపోటును నియంత్రించడంలో పిస్తా బాగా ఉపయోగపడుతుంది. వీటితో పాటు అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. పిస్తాల్లో ప్రొటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వు, వివిధ రకాల యాంటీఆక్సిడెంట్లు అధికం. వీటిలో ఉండే పోషకాలు బరువు తగ్గడానికే కాకుండా గుండె ఆరోగ్యాన్నీ కాపాడతాయి. కాబట్టి పిస్తాలను ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ప్రయోజనాలు పొందవచ్చు. పిస్తాలో ఆరోగ్యకరమైన కొవ్వు, కార్బోహైడ్రేట్‌లు, ఫైబర్, పొటాషియం, ఇతర పోషకాలు నిండి ఉంటాయి.

పిస్తాపప్పు తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రక్తపోటును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ అవి తక్కువ గ్లైసెమిక్ ను కలిగి ఉంటాయి. పిస్తా పప్పులు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒకే లెవెల్ లో ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ ఏదైనా అధికంగా తీసుకోవడం ఆరోగ్యకరమైనది కాదని గుర్తుంచుకోవాలి.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సూచనలు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం  క్లిక్ చేయండి