Sugar Tips: షుగర్ పేషెంట్స్ కు అద్భుతమైన టిప్..వెల్లుల్లి కషాయం తాగితే వ్యాధి హాంఫట్

ప్రస్తుత ఆహార అలవాట్ల కారణంగా షుగర్ వ్యాధి అందరికీ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల షుగర్ వ్యాధిగ్రస్తులు తమ ఆహార నియమాలపై ప్రత్యేక దృష్టి పెడతారు. ఎందుకంటే తమ ఆహార అలవాట్ల కారణంగానే షుగర్ లెవెల్స్ లో హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి.

Sugar Tips: షుగర్ పేషెంట్స్ కు అద్భుతమైన టిప్..వెల్లుల్లి కషాయం తాగితే వ్యాధి హాంఫట్
Garlic Water
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Dec 17, 2022 | 11:20 AM

షుగర్ వ్యాధి..దీని ప్రభావం ప్రస్తుతం నలభై ఏళ్లు వయస్సు పైబడిన వారందరిపై ఉంటుంది. షుగర్ సమస్యకు ప్రధాన కారణం శరీరం ఇన్సులిన్ ఉత్పత్తి చేసుకోలేకపోవడమే. షుగర్ వంశపారంపర్యంగా వస్తుందని అందరూ నమ్ముతారు. కానీ ప్రస్తుత ఆహార అలవాట్ల కారణంగా కూడా షుగర్ వ్యాధి అందరికీ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల షుగర్ వ్యాధిగ్రస్తులు తమ ఆహార నియమాలపై ప్రత్యేక దృష్టి పెడతారు. ఎందుకంటే తమ ఆహారపు అలవాట్ల కారణంగానే షుగర్ లెవెల్స్ లో హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో షుగర్ వ్యాధిని అదుపులో ఉంచడానికి ఓ ప్రత్యేక చిట్కాను వైద్యులు సూచిస్తున్నారు. అదే వెల్లుల్లి

వెల్లుల్లి కషాయంతో అదుపులో షుగర్ లెవెల్స్

వెల్లుల్లి మన శరీరానికి చాలా మేలు చేస్తుందని అందరికీ తెలుసు. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి దివ్య ఔషధంలా పని చేస్తుంది. అయితే వెల్లుల్లి షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా చాలా ఉపయోగపడుతుంది. వెల్లుల్లితో కషాయం చేసుకుని తాగితే షుగర్ సమస్య అదుపులో ఉంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

వెల్లుల్లి కషాయం చేసుకోవడం ఇలా

ముందుగా వంద గ్రాముల వెల్లుల్లితో చేసుకున్న రసంలో తగిన మోతాదులో ఉల్లిపాయ రసం, నిమ్మరసం, అల్లం రసం కలపాలి. వీటిని బాగా మిక్స్ చేసి బాగా కలుపుతూ ఉడికించాలి. అనంతరం రసం ఎంత ఉందో అంతే మొత్తంలో తేనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని ప్రతి రోజూ ఓ చెంచా తాగితే చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. అలాగే హార్ట్ బ్లాక్ సమస్య నుంచి బయటపడడానికి సహాయం చేస్తుంది. 

ఇవి కూడా చదవండి

వెల్లుల్లి రెబ్బలు తిన్నా మేలే

ఒకవేళ కషాయం చేసుకోలేని వారు రోజూ రెండు నుంచి మూడు వెల్లుల్లి రెబ్బలను తిన్నా షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయనేది నిపుణులు మాట. అలా చేయలేని వారు రాత్రిపూట వెల్లుల్లిని నీళ్లల్లో నానబెట్టి ఉదయాన్నే పరగడపున తింటే మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!