Diabetes: షుగర్ వ్యాధిని నియంత్రణలో పెట్టుకునేందుకు.. రోజూ ఇవి తినండి..

ఆరోగ్యకర జీవితం కోరుకునే వారు తగినంత పోషకాహారాలు తీసుకోవాలి. మన శరీరానికి శక్తినిచ్చేవి పోషకాహరాలే. చాలామంది ఆరోగ్య ప్రయోజనాల కోసం డ్రైఫ్రూట్స్ తీసుకుంటారు. నేటి బిజీ షెడ్యూల్ లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ..

Diabetes: షుగర్ వ్యాధిని నియంత్రణలో పెట్టుకునేందుకు.. రోజూ ఇవి తినండి..
Diabetes
Follow us

|

Updated on: Dec 17, 2022 | 10:47 AM

ఆరోగ్యకర జీవితం కోరుకునే వారు తగినంత పోషకాహారాలు తీసుకోవాలి. మన శరీరానికి శక్తినిచ్చేవి పోషకాహరాలే. చాలామంది ఆరోగ్య ప్రయోజనాల కోసం డ్రైఫ్రూట్స్ తీసుకుంటారు. నేటి బిజీ షెడ్యూల్ లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకునేవారి సంఖ్య తగ్గుతుంది. డ్రైఫ్రూట్స్ తో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. అయితే వీటిలో ప్రధానంగా చెప్పుకోవల్సినవి వాల్ నట్స్. వీటిని రోజూ తగిన మోతాదులో తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతంగా ఉండవచ్చు. ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఎన్న వాల్ నట్ లు మెదడు ఆరోగ్యానికి, జ్ఞాపకశక్తికి మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వాల్ నట్స్ లో ప్రొటీన్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్, సెలీనియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండటంతో వాల్ నట్స్ ను డ్రై ఫ్రూట్స్ లో రారాజుగా పిలుస్తారు. వీటిని నానబెట్టి ఉదయం పరగడుపునే తినడంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

రెండు వాల్ నట్స్ ను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం తినాలి. వాల్ నట్స్ ను అక్రోట్ అని కూడా పిలుస్తారు. వాల్ నట్స్ తో మధుమేహని నియంత్రించవచ్చు. అలాగే అరుగుదలకు కూడా ఇవి ఉపయోగపడతాయి. ఎముకలు గట్టిపడటంతో పాటు.. గుండె ఆరోగ్యానికి కూడా వాల్ నట్స్ మంచివి. వాల్ నట్స్ తో ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

 కోవిడ్ సమయంలో డ్రైఫ్రూట్స్ కు విపరీతమైన డిమాండ్ పెరిగిన విషయం తెలిసిందే. డ్రైఫ్రూట్స్ తినడం అలవాటు లేని వాళ్లు కూడా వాటిని తినడం అలవాటుచేసుకోవడానికి ముఖ్య కారణం. డ్రైఫ్రూట్స్ లో రోగనిరోధక శక్తిని పెంచే శక్తి ఉండటమే. ఈ డ్రైఫ్రూట్స్ లో కూడా వాల్ నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో వ్యక్తిలోని రోగనిరోధక శక్తిని ఇవి పెంచుతాయి. అనేక వ్యాధుల నుంచి వాల్ నట్స్ రక్షణ కల్పిస్తాయి. ఆరోగ్యంగా, ధృడంగా ఉండేందుకు మనం తీసుకునే ఆహారంలో నానబెట్టిన వాల్ నట్స్ ను తీసుకోవడం అలవాటు చేసుకుంటే మంచిది.

ఇవి కూడా చదవండి

జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది

 వాల్ నట్స్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందుకే జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకాన్ని నివారించడంతో పాటు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాల అవసరం. రోజూ తగిన మోతాదులో వాల్ నట్స్ తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ వ్యవస్థ మెరుగవుతుంది.

మధుమేహన్ని కంట్రోల్ చేయ్యొచ్చు

 షుగర్ ఉన్న వారు నానబెట్టిన వాల్ నట్స్ తినడం వల్ల ఎంతో ప్రయోజనం పొందుతారు. వాల్ నట్ లను రోజూ తినేవారిలో టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం తక్కువుగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వాల్ నట్ లు రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతాయి.

ధృఢంగా ఎముకలు

ఎముకలు, దంతాలను దృఢంగా ఉంచడానికి అక్రోట్ లు సహాయపడతాయి. వాల్ నట్స్ లో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి దోహదపడుతుంది. వాల్ నట్స్ లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ లు వాపును దంతాలు, ఎముకుల వాపును తగ్గిస్తాయి.

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించే లక్షనాలు వాల్ నట్స్ లో ఉన్నాయి. వీటిలో పాలీఫెనాల్ ఎల్లాగిటానిన్ లు ఉంటాయి. అనేక రకాల క్యాన్సర్ ల నుండి రక్షించడంలో ఇవి ఉపయోగపడతాయి.

గుండె ఆరోగ్యానికి మేలు

 గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో వాల్ నట్స్ సహాయపడతాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వాల్ నట్స్ లో ఉంటాయి. అధిక రక్తపోటు ఉన్నవారికి వాల్ నట్ లు ప్రయోజనకరంగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..