AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Headache: చల్ల గాలి వల్ల తలనొప్పి వేధిస్తుందా.? ఈ ఇంటి చిట్కాలతో చెక్‌ పెట్టండి.

ప్రస్తుతం చలిపులి పంజా విసురుతోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇలాంటి సమయాల్లో కొందరు అనివార్యంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దీంతో చెవుల్లోకి చల్లటి గాలి వెళ్డడం కారణంగా తలనొప్పి సమస్య వేధిస్తుంటుంది. చల్లటి గాలిలో...

Headache: చల్ల గాలి వల్ల తలనొప్పి వేధిస్తుందా.? ఈ ఇంటి చిట్కాలతో చెక్‌ పెట్టండి.
Headache
Narender Vaitla
|

Updated on: Dec 17, 2022 | 6:45 AM

Share

ప్రస్తుతం చలిపులి పంజా విసురుతోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇలాంటి సమయాల్లో కొందరు అనివార్యంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దీంతో చెవుల్లోకి చల్లటి గాలి వెళ్డడం కారణంగా తలనొప్పి సమస్య వేధిస్తుంటుంది. చల్లటి గాలిలో కొద్దిసేపు తిరిగినా వెంటే తలనొప్పి సమస్య మొదలవుతుంది. ఇలా చల్ల గాలి వల్ల తలనొప్పి రావడాన్ని హెమోడైనమిక్ అని చెబుతుంటారు. అయితే ఇలా తలనొప్పి వచ్చిన వెంటనే ట్యాబ్లెట్స్‌ వేసుకోకుండా ఇంట్లో లభించే కొన్ని సహజ సిద్ధమైన వస్తువులతో సమస్యకు చెక్‌ పెట్టవచ్చు. అవేంటంటే..

* చల్లటి గాలి వల్ల తలనొప్పి సమస్య వేధిస్తుంటే ప్రతి రోజూ పసుపు కలిపిన పాలు తాగాలని నిపుణులు చెబుతున్నారు. ఇవి శరరీరానికి వేడిని అందించడమే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

* హెర్బల్‌ టీ కూడా తలనొప్పి సమస్యకు ఇట్టే చెక్‌ పెడుతుంది. ఆయుర్వేదం ప్రకారం తులసి, అల్లంతో తయారు చేసిన టీ ని తాగడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. కేవలం తలనొప్పికే కాకుండా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.

ఇవి కూడా చదవండి

* లవంగం, యాలకులు, ఎండుమిర్చి, అశ్వగంధ తదితర మూలికలతో చేసిన కషాయాన్ని తాగడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. కరోనా సమయంలో చాలా మంది ఇలాంటి వాటిని తీసుకున్న విషయం తెలిసిందే. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

* కొన్ని సందర్భాల్లో శరీరానికి సరిపడ విటమిన్లు అందకపోవడం వల్ల కూడా తలనొప్పి సమస్య వేధిస్తుంటుంది. శరీరానికి కావాల్సినంత విటమిన్‌ డి అందేలా చూసుకోవాలి. ఉదయం పూట సూర్యకాంతి పడేలా చూసుకోవాలి. అలాగే అరటి లేదా పాలను క్రమం తప్పకుండా తీసుకోవాలి.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..