AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pancreatic Cancer Symptoms: కడుపు నొప్పి వచ్చినా లైట్ తీసుకుంటున్నారా? అది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కావొచ్చు

శరీరంలో చక్కెర హెచ్చు తగ్గులకు కారణమయ్యే ఇన్సులిన్ ను ప్యాంక్రియాస్ రిలీజ్ చేస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్యాంక్రియాస్ నిర్వహణ అనేది చాలా ముఖ్యం. అయితే ఈ ప్యాంక్రియాస్ ద్వారా కూడా క్యాన్సర్ ముప్పు ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది చాలా అరుదుగా వచ్చే క్యాన్సర్.

Pancreatic Cancer Symptoms: కడుపు నొప్పి వచ్చినా లైట్ తీసుకుంటున్నారా? అది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కావొచ్చు
Stomach Pain
TV9 Telugu Digital Desk
| Edited By: Anil kumar poka|

Updated on: Dec 16, 2022 | 3:39 PM

Share

ప్యాంక్రియాస్ అనేది కడుపు దిగువ భాగంలో ఉండే ఒక అవయవం. దీన్ని తెలుగులో క్లోమం అని అంటారు. జీర్ణక్రియలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలో చక్కెర హెచ్చు తగ్గులకు కారణమయ్యే ఇన్సులిన్ ను ప్యాంక్రియాస్ రిలీజ్ చేస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్యాంక్రియాస్ నిర్వహణ అనేది చాలా ముఖ్యం. అయితే ఈ ప్యాంక్రియాస్ ద్వారా కూడా క్యాన్సర్ ముప్పు ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది చాలా అరుదుగా వచ్చే క్యాన్సర్. సాధారణంగా ప్యాంక్రియాస్ నాళాల లైనింగ్‌లో ప్రారంభమవుతుంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ సంకేతాలు అరుదుగా కనిపిస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ధూమపానం, మధుమేహం, దీర్ఘకాలిక ప్యాంక్రియాటైటిస్, ప్యాంక్రియాస్ వాపు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కు ముఖ్య కారణాలని వైద్యులు చెబుతున్నారు. 

ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం నిర్లక్ష్యం వద్దు

  1. పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి వస్తే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కావొచ్చు. మొదట చిన్నగా వచ్చే నొప్పి..ఉండే కొద్దీ తట్టుకోలేనంతగా వస్తే మనం క్యాన్సర్ ముప్పు ఉందేమో? అని ఆలోచించాలి.
  2.  వెన్నునొప్పి కూడా ఈ క్యాన్సర్ బారిన పడిన వారికి రావొచ్చు. క్యాన్సర్ ప్యాంక్రియాస్ చుట్టు ఉన్న నరాలకు ప్రసరించినప్పుడు మీకు వెన్ను నొప్పి వచ్చే అవకాశం ఉంది. 
  3.  శరీరంలో బిల్ రుబిన్ శాతం పెరగినప్పడు  చర్మంపై దురద వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తరచూగా దురద వస్తే వైద్యులను సంప్రదించాలి.
  4.  ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉన్న ఉన్న అకస్మాత్తుగా బరువు తగ్గుతారు. అలాగే పోషకాలను ప్రాసెస్ చేయడానికి శరీరానికి అవసరమయ్యే జీర్ణ రసాలు ఉత్పత్తి చేయలేకపోతుంది. దీంతో తక్కువ తిన్నా కూడా కడుపు నిండిపోయినట్లు అనిపిస్తుంది. ఈ కారణంతో బరువు తగ్గుతారు. 
  5.  మల విసర్జన చేసినప్పడు దుర్వాసన రావడం అలాగే మలం కూడా జిడ్డుగా ఉంటే మనం జాగ్రత్త పడాలి. 
  6.  చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారితే మనం ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఏమోనని అనుమానపడాలి. అయితే చాలా మంది ఈ సంకేతాన్ని కామెర్లు అని అనుకుంటారు. కానీ, ప్యాంక్రియాస్ చివరిలో ఒక చిన్న కణితి కామెర్లుకి కారణం కావచ్చు.
  7.  మూత్రం పసుపు పచ్చగా వచ్చినా అనుమానించాలి ఎందుకంటే రక్తంలో బిల్ రుబిన్ స్థాయి పెరిగితే మూత్రం పసుపు పచ్చగా వస్తుంది.
  8.  అలాగే సడెన్ గా మధుమేహ బారిన పడినా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కారణం కావొచ్చు. ఈ క్యాన్సర్ ఇన్సులిన్ తయారు చేసే కణాలను నాశనం చేయడంతో మధుమేహ బారిన పడవచ్చు. 
  9.  అలాగే ఎలాంటి కారణం లేకుండా చాలా అలసిపోయినట్లు అనిపించడం కూడా ఈ వ్యాధి సంకేతమే అని గుర్తు పెట్టుకోవాలి. 

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం