AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tooth Pain: పంటి నొప్పితో బాధపడుతున్నారా..? అయితే ఈ సింపుల్‌ టిప్స్‌ పాటించండి.. వెంటనే ఉపశమనం లభిస్తుంది..

Natural Remedies for Tooth Pain: పంటి నొప్పి ఎంత బాధిస్తుందో ఆ అనుభవాన్ని ఎదుర్కొన్న వారికే తెలుస్తుంది. సహజంగా పుప్పిళ్లు, దంతాళ్లో పగుళ్లు, చిగుర్లు ఉబ్బడం వల్ల పంటినొప్పి సమస్య వస్తుంది. అయితే పుప్పిళ్లు వంటి పెద్ద పెద్ద సమస్యలు వస్తే ఎలాగూ..

Tooth Pain: పంటి నొప్పితో బాధపడుతున్నారా..? అయితే ఈ సింపుల్‌ టిప్స్‌ పాటించండి.. వెంటనే ఉపశమనం లభిస్తుంది..
Tooth Pain
Narender Vaitla
|

Updated on: Mar 21, 2021 | 5:37 AM

Share

Natural Remedies for Tooth Pain: పంటి నొప్పి ఎంత బాధిస్తుందో ఆ అనుభవాన్ని ఎదుర్కొన్న వారికే తెలుస్తుంది. సహజంగా పుప్పిళ్లు, దంతాళ్లో పగుళ్లు, చిగుర్లు ఉబ్బడం వల్ల పంటినొప్పి సమస్య వస్తుంది. అయితే పుప్పిళ్లు వంటి పెద్ద పెద్ద సమస్యలు వస్తే ఎలాగూ.. వైద్యులను సంప్రదించాల్సిందే. అలా కాకుండా సాధారణ పంటి నొప్పి, చిగుళ్లు ఉబ్బడం వల్ల కలిగే నొప్పిని కొన్ని సహజ పద్ధతుల ద్వారా తగ్గించుకోవచ్చనే విషయం మీకు తెలుసా.? పంటి సమస్యలకు చెక్‌ పెట్టే కొన్ని సహజ పద్ధతులపై ఓ లుక్కేయండి.

* ఉన్నపలంగా పంటి నొప్పి వస్తే ఐస్‌ ముక్కలతో ఉపశమనం పొందవచ్చు. ఒక పలుచటి గుడ్డలో కొన్ని ఐస్‌ ముక్కలను తీసుకొని నొప్పిగా ఉన్న పంటిపై నెమ్మదిగా ఒత్తాలి దీంతో నొప్పి నుంచి వెంటనే ఉపశమనం పొందవచ్చు.

Garlic

Garlic

* ఇక పంటి నొప్పిని తగ్గించడంలో వెల్లుల్లి కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే యాంటి బయోటిక్‌ గుణాలు తీవ్రమైన పంటి నొప్పి నుంచి కూడా వెంటనే రిలీఫ్‌ అందిస్తుంది. వెల్లుల్లిని బాగా దంచి అందులో కొంచెం ఉప్పు లేదా మిరియాల పొడి కలిపి నొప్పిగా ఉన్న పంటిపై ఉంచితే ఫలితం ఉంటుంది.

* కొన్నిసార్లు దంతాల్లో పేర్కొన్న వ్యర్థాల కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్‌ ద్వారా కూడా పంటి నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి గోరు వెచ్చటి నీటిలో కాస్త ఉప్పు వేసి నోట్లో వేసుకొని బాగా పుకిలించాలి. దీంతో దంతాల చుట్టూ, మధ్య పేరుకుపోయిన వ్యర్థాలు బయటకు పోతాయి. నొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

Clove

Clove

* లవంగాలు కూడా పంటి నొప్పికి మంచి చిట్కాగా ఉపయోగపడతాయి. నొప్పి ఉన్న పంటిపై లవంగాన్ని పెట్టి నెమ్మదిగా నొక్కాలి దీంతో నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

* ఇక చిగుళ్ల నొప్పికి చెక్‌ పెట్టడానికి ఆవ నూనెలో ఒక చిటికెడు ఉప్పును కలిపి చిగుళ్లపై మర్దన చేస్తే ఉపశమనం లభిస్తుంది.

* అప్పుడే కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కను నొప్పిగా ఉన్న పంటిపై ఉంచుకోవడం వల్ల అప్పటికప్పుడు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

* ఇక పంటి నొప్పి ఉన్న సమయంలో తీపి పదార్థాలు, కూల్‌ డ్రింక్స్‌ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. దీనివల్ల సమస్య మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది.

Mint

Mint

* పుదీనా కూడా పంటి నొప్పిని తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

Also Read: Food For Sleep: నిద్రలేమితో సతమతమవుతున్నారా..? అయితే ఇవి తినండి.. తిండికి నిద్రకు లింక్‌ ఏంటనేగా..

Banana Benefits and Effects : బరువు తగ్గాలనుకుంటున్నారా.. అరటిపండు ట్రై చేయండి.. అయితే ఏరకం పండ్లు మంచివో తెలుసా..!

Smartphone Addiction: నిద్రను దూరం చేస్తున్న స్మార్ట్‌ఫోన్‌.. పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు వెల్లడి.

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ