Spices Effects in Summer: వేసవి కాలం తస్మాత్ జాగ్రత్త!.. ఈ మసాలా దినుసులను తక్కువగా వాడండి..!
Spices Effects in Summer: మనం రోజూ వండుకునే కూరలో వివిధ రకాల మసాలా దినుసులను తప్పక వినియోగిస్తుంటాం. అవి ఆహారం రుచిని పెంచుతాయి.
Spices Effects in Summer: మనం రోజూ వండుకునే కూరలో వివిధ రకాల మసాలా దినుసులను తప్పక వినియోగిస్తుంటాం. అవి ఆహారం రుచిని పెంచుతాయి. ఈ మసాలా దినుసులు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. వాటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ వీటిలో చాలా మసాలాలు వేసవిలో ఉపయోగించకూడనివి ఉన్నాయి. ఈ మసాలాలు శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. వేసవిలో వీటిని ఎక్కువగా వాడటం వల్ల శరీరానికి హాని కలుగుతుంది. వాటిని మితంగా తీసుకోవడం గానీ, లేదా అస్సలు తీసుకోకపోవడం గానీ చేయాలి. మరి ఆరోగ్యానికి హానీ తలపెట్టే ఆ మసాలా దినుసులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వేసవి కాలంలో ఈ మసాలా దినుసులు తీసుకోవడం మానుకోండి.. ఎండు మిర్చి: వేసవి కాలంలో మిరపకాయలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది చాలా వేడి చేస్తుంది. శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. కడుపు, ఛాతీలో మంటకు కారణం అవుతుంది. అందువల్ల, దీన్ని మితంగా తీసుకోవడం మంచిది.
అల్లం: అల్లం టీ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కానీ, వేసవిలో దీన్ని అధికంగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. దీన్ని తీసుకోవడం వల్ల విపరీతమైన చెమటలు వస్తాయి. మధుమేహం, రక్తస్రావం సమస్యలు ఉన్నవారు దీనిని ఎక్కువగా తినకూడదు. వేసవిలో దీనిని అధికంగా తీసుకోవడం వల్ల ఛాతిలో మంట, విరేచనాలు, త్రేనుపులు, ఇతర కడుపు సమస్యలు కూడా వస్తాయి.
వెల్లుల్లి: వేసవిలో వెల్లుల్లి వినియోగం తగ్గించాలి. ఇది శరీరంలో వేడిని పెంచుతుంది. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల నోటి దుర్వాసన, యాసిడ్ రిఫ్లక్స్, రక్తస్రావం వంటి ప్రమాదాలు కూడా పెరుగుతాయి. చలికాలంలో వెల్లుల్లి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ వేసవిలో దీనికి దూరంగా ఉండాలి.
నల్ల మిరియాలు: నల్ల మిరియాలు కూడా చాలా వేడి చేస్తాయి. దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఇది కొన్ని ఔషధాల ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది. అలెర్జీలకు కారణం కావచ్చు.
వేసవి కాలంలో వీటిని ఎక్కువగా తీసుకోండి.. పుదీనా: పుదీనా చాలా చల్లగా ఉంటుంది. ఇది మౌత్ ఫ్రెషనర్‌గా కూడా ఉపయోగపడుతుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది. అజీర్ణం, ఛాతీ నొప్పి, వడదెబ్బ, చర్మం, గుండెల్లో మంట నుండి ఉపశమనం కలిగిస్తుంది.
కొత్తిమీర: కొత్తిమీర ఆకుల్లో శీతలీకరణ గుణాలు ఉన్నాయి. ఇది వాపును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
(ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణుల సూచనల మేరకు ఇవ్వడం జరిగింది. TV9 తెలుగు దీనిని ధృవీకరించలేదు. నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే దీన్ని అనుసరించండి.)
Also read: