Sourav Ganguly: దాదాను జనవరి 6న డిశ్చార్జ్ చేస్తాం… రెండు, మూడు వారాల తర్వాత మళ్లీ పరీక్షలు.. డాక్టర్ రూపాలీ బసు

బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్‌ గంగూలీ ఆరోగ్యం మెరుగు పడుతోందని డాక్టర్‌ రూపాలీ బసు తెలిపారు. దాదాను జనవరి 6న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేయనున్నట్లు...

Sourav Ganguly: దాదాను జనవరి 6న డిశ్చార్జ్ చేస్తాం... రెండు, మూడు వారాల తర్వాత మళ్లీ పరీక్షలు.. డాక్టర్ రూపాలీ బసు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 05, 2021 | 2:25 PM

Sourav Ganguly: బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్‌ గంగూలీ ఆరోగ్యం మెరుగు పడుతోందని డాక్టర్‌ రూపాలీ బసు తెలిపారు. దాదాను జనవరి 6న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేయనున్నట్లు తెలిపారు. అయితే రోజు గంగూలీ ఇంటి వద్ద ఆయన ఆరోగ్యాన్ని సమీక్షిస్తామని తెలిపారు. ప్రస్తుతం సౌరబ్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. రెండు మూడు వారాల తర్వాత మళ్లీ అవసరమైతే వైద్య పరీక్షలు చేసి చికిత్స అందిస్తామని బసు తెలిపారు. కాగా దాదా జనవరి 2న ఛాతినొప్పితో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. కాగా, ఉడ్‌ల్యాండ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దాదాను కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాగూర్‌ పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకొని సాధారణ స్థితికి రావాలని క్రికెట్ అభిమానులు ఆకాంక్షించారు.

Also Read: టీమిండియాపై క్వీన్స్​ల్యాండ్ ఆరోగ్య మంత్రి అనుచిత వ్యాఖ్యలు… రాస్ బేట్స్​పై బీసీసీఐ ఆగ్రహం

Latest Articles