Telangana: విద్యార్థినుల వినూత్న ఆవిష్కరణ… స్త్రీల కోసం ‘స్త్రీ రక్షా ప్యాడ్లు’…

తెలంగాణ విద్యార్థినులు వినూత్న ఆవిష్కరణను చేపట్టారు. స్త్రీలు నెలసరిలో పడే అసౌకర్యానికి సహజ పద్దతిలో తయారు ప్యాడ్లను తయారు చేసి ఔరా అనిపించారు. తక్కవ..

Telangana: విద్యార్థినుల వినూత్న ఆవిష్కరణ... స్త్రీల కోసం ‘స్త్రీ రక్షా ప్యాడ్లు’...
Follow us

| Edited By:

Updated on: Jan 05, 2021 | 10:59 AM

తెలంగాణ విద్యార్థినులు వినూత్న ఆవిష్కరణను చేపట్టారు. స్త్రీలు నెలసరిలో పడే అసౌకర్యానికి సహజ పద్దతిలో తయారు ప్యాడ్లను తయారు చేసి ఔరా అనిపించారు. తక్కవ ఖర్చుతో ప్రకృతికి ఎటువంటి హాని కలిగించని ప్యాడ్లను తయారు చేసి అందరి చేత శభాష్ అనిపించారు.

స్కూల్ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌లో…

తెలంగాణ విద్యాశాఖ, తెలంగాణ ఇన్నోవేషన్‌ సెల్‌, యూనిసెఫ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్కూల్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌’ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో నిర్వహించారు. దీనిలో యాదాద్రి భువనగిరి జిల్లా ముల్కలపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థినులు అనిత, శైలజ, లలిత పాల్గొన్నారు. వీరు ఆర్గానిక్‌ స్త్రీరక్షాప్యాడ్లను తయారుచేశారు. వారి ఇన్నోవేషన్‌కు ప్రథమ బహుమతి కింద రూ.75 వేల నగదు లభించింది.

తయారీ ఇలా…

విద్యార్థినులు తయారు చేసిన స్త్రీ రక్షా ప్యాడ్లను ప్రకృతికి ఏ మాత్రం హాని కలిగించని విధంగా తయారు చేశారు. కాటన్‌ లేయర్ల మధ్యలో గుర్రపుడెక్క ఆకు, వేప, పసుపు, మెంతులు, సబ్జ గింజలను ఉపయోగించి ప్యాడ్లను తయారుచేశారు. వీటిలో సబ్జ గింజలు, మెంతులు తడిదనాన్ని పీల్చుకుంటాయి. వేప, పసుపు ఇన్ఫెక్షన్‌ కాకుండా రక్షిస్తాయి. వారు ఈ ప్యాడ్లను కేవలం రెండు రూపాయలకే అందించవచ్చని తెలుపుతున్నారు. నెలసరి సమయంలో మహిళలు ప్రస్తుతానికి వాడుతున్న శానిటరీ ప్యాడ్లు అత్యధిక ఖర్చుతో కూడినవని, పైగా వాటి తయారీలో వాడే పాలిథిన్‌ తొందరగా భూమిలో కలిసిపోయేది కాదని విద్యార్థిని లలిత తెలుపుతున్నారు. వాటి వాడకం క్యాన్సర్‌కు దారితీస్తున్నదని తెలుపుతోంది.

Also Read: Telangana Corona Cases : రాష్ట్రంలో కొత్తగా 253 వైరస్ పాజిటివ్ కేసులు..యాక్టీవ్ కేసులు, మరణాల సంఖ్య తదితర వివరాలు