Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: గర్భధారణకు మంచి సమయం ఇదే.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే మీ జీవితమంతా ఆనందమే

దాంపత్య జీవితంలో సంతానం అనేది ఒక అద్భుతమైన విషయం. అయితే సంతానం ఎలా పొందాలి అనే అంశంపై దంపతులకు కొన్ని అనుమానాలు ఉంటాయి. గర్భం దాల్చాలనుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కొన్ని చిట్కాలు, పద్ధతులు....

Health: గర్భధారణకు మంచి సమయం ఇదే.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే మీ జీవితమంతా ఆనందమే
Pregnency Tips
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jul 10, 2022 | 6:15 AM

దాంపత్య జీవితంలో సంతానం అనేది ఒక అద్భుతమైన విషయం. అయితే సంతానం ఎలా పొందాలి అనే అంశంపై దంపతులకు కొన్ని అనుమానాలు ఉంటాయి. గర్భం దాల్చాలనుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కొన్ని చిట్కాలు, పద్ధతులు పాటించడం ద్వారా ఆ సమస్యల నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. గర్భం దాల్చాలనుకునే ముందు గైనకాలజిస్ట్ లను సంప్రదించాలి. మీరు శారీరకంగా మానసికంగా సిద్ధంగా ఉన్నప్పటికీ వైద్యుడు ఇచ్చే కొన్ని సూచనలు పాటించడం ద్వారా ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చు. పెళ్లై సంవత్సరాలు గడుస్తున్నా పిల్లలు పుట్టకపోతే కొన్ని పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. టెస్టోస్టెరాన్, ఇతర హార్మోన్ల స్థాయిలను తనిఖీ చేయడానికి రక్త పరీక్షను చేయించుకోవాసలి. స్పెర్మ్ కదలికలు, నాణ్యతను తెలుసుకునేందుకు వీర్య పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. సాధారణంగా దంపతులు ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి శృంగారంలో పాల్గొంటారు. తరచుగా కలయికలో పాల్గొనడం ద్వారా మంచి పరిణామాలు ఉంటాయి. మహిళలకు అండం విడుదలయ్యే సమయంలో శారీరకంగా కలిస్తే మంచి ఫలితం ఉంటుంది. అయితే మగవారిలో వంధ్యత్వం అనేది ఇప్పుడు పెను సమస్యగా మారుతోంది. ప్రస్తుత కాలంలో ఇది వివిధ కారణాల వల్ల పెరుగుతోంది. కాబట్టి సంతానోత్పత్తిని ప్రోత్సహించడానికి ఆరోగ్యకరమైన, ఒత్తిడి లేని జీవనశైలిని కొనసాగించడం భాగస్వాములిద్దరి బాధ్యత.

ఆల్కహాల్, పొగాకు వినియోగం సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. సిగరెట్ ఎక్కువగా తాగే మహిళల్లో గర్భధారణ సమస్యలు వస్తుండగా మగవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గుతోంది. స్థూలకాయం, అధిక బరువు హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. ఇది సంతానంపై దుష్ప్రభావం కలిగించే అవకాశం లేకపోలేదు. గర్భం దాల్చాలని భావించే దంపతులు తమ దినచర్య, ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలి. వ్యాయాయం చేయడంతో పాటు ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. గర్భం దాల్చే సమయంలో ఒత్తిడి గురయ్యే విషయాల నుంచి దూరంగా ఉండాలి. ఈ సూచనలు పాటిస్తే ఆనందకరమైన సంతానాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

నోట్.. ఇందులో పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సూచనలు తీసుకోవడం ఉత్తమం.